For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిల్లీ ఎగ్ విత్ క్యాప్సికమ్ రిసిపి: స్పెషల్ సైడ్ డిష్

|

క్యాప్సికమ్ ఒక హెల్తీ వెజిటేబుల్ . ముఖ్యంగా చిల్లీ, ఎగ్ మరియు క్యాప్సికమ్ కాంబినేషన్ రిసిపి చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ మూడింటి కాంబినేషన్ లో వంటను చాలా త్వరగా తయారు చేయవచ్చు . దాల్ మరియు వైట్ రైస్ తో పాటు ఈ రుచికరమైన సైడ్ డిష్ చాలా సెన్షేషనల్ గా ఉంటుంది.

క్యాప్సికమ్ ఒక హెల్తీ వెజిటేబుల్ ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనే వారు వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోగలిగే ఒక ఫుల్ న్యూట్రీషియన్ ఫుడ్ . క్యాప్సికమ్ కు ఎగ్ చేర్చి ఈ మిక్స్డ్ కాంబినేషన్ రిసిపిలో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఈ రెండూ వేటికవి ప్రత్యేకంగా వ్యాధినిరోధకతను పెంచుతాయి . ఈ రుచికరమైన క్యాప్సికమ్ రిసిపిని ఎగెటేరియన్స్ కూడా ఎక్కువగా ఇష్టపడుతారు . మరి ఇంకెందుకు ఆలస్యం, క్యాప్సికమ్ ఎగ్ రిసిపి ఎలా తయారుచేయాలో తెలుసుకోండి...

Chilly Egg With Capsicum Recipe

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4
నూనె: 2tbsp
వెల్లుల్లి: 1tbsp
ఉల్లిపాయలు: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
చిల్లీ సాస్: 1tbsp
టమోటో సాస్: 1tbsp
పెప్పర్: 1tbsp
క్యాప్సికమ్: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అజినోమోటో: ఒక చిటికెడు
ఉప్పు: కొద్దిగా

Chilly Egg With Capsicum Recipe

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్డు పగులకొట్టి పోయాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఫ్లాట్ గా ఉండే పాన్ మీద వేసి లైట్ గా కాలిన తర్వాత ఈ స్క్రాబుల్డ్ ఎగ్ ను ఒక బౌల్లో తీసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి.
2. అదే పాన్ లేదా వేరే పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక , అందులో సన్నగా కట్ చేసుకొన్న వెల్లుల్లి రెబ్బలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

Chilly Egg With Capsicum Recipe
3. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం మిశ్రమం మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి .
అలాగే అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

Chilly Egg With Capsicum Recipe
5. ఇప్పుడు స్క్రాంబుల్డ్ ఎగ్ ను అందులో వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అందులోనే చిల్లీ సాస్ మరియు టమోటో సాస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
6. చివరగా అందులో చిటికెడు అజినామోటో, పెప్పర్ పౌడర్ చిలకరించి ఒక నిముషం ఫ్రై చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే క్యాప్సికమ్, ఎగ్ రిసిపి రెడీ.

English summary

Chilly Egg With Capsicum Recipe


 
 Chilly Egg With Capsicum...... The name itself sounds yum!! Today, Boldsky shares with you this delicious recipe which you can prepare in less than 20 minutes. If you have dal and your white rice ready, then this yummy side dish will be a sensational treat to your plate.
Story first published: Saturday, February 7, 2015, 12:35 [IST]
Desktop Bottom Promotion