For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్లాసిక్ చీజ్ ఆమ్లెట్ : బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

ఉదయం తీసుకొనే అల్పాహారం ఆరోజంతటికి చాలా ముఖ్యమైనది. ఎందకంటే ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీనులు, న్యూట్రిషయన్ అంది, ఆరోజంతటికి మనకు కావల్సిన శక్తినందిస్తుంది. దాంతో మనం ఉత్సాహంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అందుకే ఉదయం తయారుచేసే బ్రేక్ ఫాస్ట్ రిసిలు వివిధ రకాలుగా..వివిధ వెరైటీలు ఉన్నాయి.

అదేవిధంగా, బ్రెడ్ మరయు గుడ్డు రెండు ప్రతి ఇంట్లోనూ డామినేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా బ్యాచులర్ గా లేదా ఒక్కరే ఉండే వారి ఇల్లల్లో చాలా సందర్బాల్లో బ్రెడ్ మరయు ఆమ్లెట్టే. దీన్ని సాదారణంగా తయారు చేసి వంటకాదు, వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరం మరియు కడుపు నిండుగా ఉంటుంది. గుడ్డులో అనేక న్యూట్రీషియన్స్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. కాబట్టే అవి ఉదయం తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి ఆరోగ్యకరం. క్లాసిక్ చీజ్ ఆమ్లెట్ : బ్రేక్ ఫాస్ట్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

Classic Cheese Omelette For Breakfast: Breakfast Recipes in Telugu

కావల్సిన పదార్థాలు:
గుడ్లు- 4
బ్రెడ్ - 6 slices (టోస్ట్ చేసుకోవాలి)
చెద్దార్ చీజ్ - 2 tbsp (తురుము కోవాలి)
క్యాప్సికమ్ - 3 tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
క్యారెట్ -2 tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కొత్తిమీర -1 tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి -1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
బ్లాక్ పెప్పర్ పౌడర్-1 tsp
పాలు-3 tbsp
నూనె- 2 tsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆమ్లెట్ కోసం సిద్దం చేసి పదార్థాలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా బట్టర్ లేదా నూనె వేసి వేడి చేయాలి. పాన్ మొత్తం స్పెడ్ చేయాలి.
3. ఇప్పుడు పాన్ లో గుడ్డు మిశ్రమాన్ని పాన్లో వేసి స్ప్రెడ్ చేసి, దాని మీద చీజ్ తురుమును స్ప్రెడ్ చేయాలి. ఆమ్లెట్ గోల్డ్ బ్రౌన్ కలర్ లోని మారే వరే వరకూ రెండు వైపులా ఫ్రై చేయాలి .
4. రెండు వైపులా బాగా కాలిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్లేట్ లోనికి తీసుకొని సాడ్వించ్ బట్టర్ టోస్ట్ తో సర్వ్ చేయాలి. అంతే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి రెడీ...

English summary

Classic Cheese Omelette For Breakfast: Breakfast Recipes in Telugu

Classic Cheese Omelette For Breakfast: Breakfast Recipes in Telugu, Indulging in a healthy and nutritious breakfast is a must as it hydrates and strengthens the body for the entire day; it also reduces the dreaded hunger pangs.
Story first published: Friday, November 6, 2015, 18:33 [IST]
Desktop Bottom Promotion