For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన భునా గోష్ట్ నాన్ వెజ్ రిసిపి

|

భునా గోష్ట్ ఒక ట్రెడిషినల్ నాన్ వెజ్ రిసిపి. సాధారణంగా ఈ వంటను మేక మాంసంతో తయారుచేస్తారు. మటన్ ను చాలా నిధానంగా అతి తక్కువ మంట మీద ఉడికిస్తారు. అంతే కాదు ఈ వంటకు వివిధ రకాల ఇండియన్ మసాలా దినుసులు జోడించి చేయడం వల్ల అంతటి రుచి దీనికి వస్తుంది .

ఈ వంటను చిక్కటి గ్రేవీగా తయారుచేస్తారు. ఈ భునా గోష్ట్ చాలా రుచికరంగా ఉంటుంది. మరియు డ్రైవెల్ వెట్ గ్రేవీ చూడగానే నోరూరిస్తుంటుంది. ఇది పుల్కా మరియు నాన్ లకు మంచి కాంబినేషన్ .మరి ఈ స్పెషల్ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Delicious Bhuna Gosht Recipe

కావల్సిన పదార్థాలు:
మటన్(ఎముకలతో సహా): 600grm
ఆవనూనె: 4tbsp
లవంగాలు: 4-5
మిరియాలు: 5-6
బ్లాక్ యాలకులు: 3-4
గ్రీన్ యాలకులు: 3-4
బే ఆకు: 2
జాపత్రి: 1 ముక్క
దాల్చిన చెక్క: 1 చిన్న ముక్క
ఉల్లిపాయ: 2 cups (సన్నగా ముక్కలు)
అల్లం: 1 చిన్న ముక్క (తురిమినది)
వెల్లుల్లి రెబ్బలు: 10-12(చూర్ణం)
గ్రీన్ చిల్లి: 2 (భాగాలుగా చీలిక)
ఉప్పు: రుచికి సరిపడా
పెరుగు : ½cup
ఎర్ర కారం పొడి: 1tsp
పసుపు: ½tsp
కొత్తిమీర పొడి: 2tsp
గరం మసాలా పొడి: 1tsp
తాజా కొత్తిమీర: 4tbsp(సన్నగా తరిగినది)

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో ఆవనూనె వేసి వేడి చేయాలి. వేడయ్యి, కొద్దిగా పొంగిలే వేడిచేయాలి.
2. తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపుకొని, 5నిముషాలు చల్లార్చుకోవాలి.
3. 5నిముషాల తర్వాత తిరిగి వేడి చేసి, అందులో లవంగాలు, బ్లాక్ పెప్పర్ కార్న్స్ , బ్లాక్ యాలకులు, గ్రీన్ యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి మరియు చెక్క వేసి 15సెకెండ్స్ వేయించుకోవాలి.
4. తర్వాత అందులో ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి 10నిముషాలు వేయించుకోవాలి.
5. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి .
6. ఇప్పుడు అందులో మటన్ ముక్కలు కూడా వేసి ఎక్కువ మంట మీద 3-4నిముషాలు వేయించుకోవాలి.
7. తర్వాత ఇందులో అరకప్పు నీళ్ళు పోసి, మూత పెట్టి 4-5విజిల్స్ వచ్చే వరకూ మటన్ 80%ఉడికించుకోవాలి.
8. 5విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. ఆవిరి మొత్తం తగ్గే వరకూ అలాగే ఉండి, తర్వాత కుక్కర్ మూతను తొలగించాలి.
9. తర్వాత అందులో పెరుగు, కారం, పసుపు, మరియు ధనియాల పొడి వేయాలి.
10. తక్కువ మంట మీద ఉడికించడం వల్ల నూనె విడిగా మరియు మసాలా రెడ్ కలర్ లో మారే వరకూ ఉడికించుకోవాలి.
11. ఇప్పుడు అందులో గరం మసాలా పౌడర్ మరియు తాజా కొత్తిమీర తరుగును వేసి మిక్స్ చేసి వేడి వేడిగా పుల్కా లేదా నాన్ తో సర్వ్ చేయాలి.

English summary

Delicious Bhuna Gosht Recipe

Bhuna gosht is a traditional Indian mutton recipe usually made with goat's mutton. Mutton is slowly cooked under low heat with a blend of different spices which adds to the richness of the dish.
Story first published: Saturday, January 4, 2014, 11:46 [IST]
Desktop Bottom Promotion