For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొయ్యల డ్రై మసాలా సీఫుడ్ స్పెషల్

|

ప్రాన్స్ లేదా ష్రింప్స్ ఒక పాపులర్ సీఫుడ్. ఇవి చాలా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైనవి ప్రాన్స్ లో అధిక ప్రోటీనులు మరియు తక్కువ ఫ్యాట్ మరియు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. అందుకే ఇది ఆరోగ్యకరం. ప్రాన్స్ లోశ్యాచురేట్ ఫ్యాట్స్. మీరు మీ రెగ్యులర్ డైట్ లో ప్రాన్స్ ను చేర్చుకోవడం వల్ల మీరు లో మీరు బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు మరియు గుండె సంబంధిత జబ్బులను తగ్గించుకోవచ్చు .

మాంసం మరియు బీఫ్ తో పోల్చితే, ప్రాన్స్ లో ఉన్న క్యాలరీలు చాలా తక్కువ. ముఖ్యంగా ప్రాన్స్ లోని న్యూట్రీషినల్ బెనిఫిట్స్ మిమ్మల్ని మరింత హెల్తీగా మార్చుతుంది. మరియు ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది. ప్రాన్స్ తో తయారుచేసే వంటలు వివిధ రకాలుగా ఉన్నాయి . మీకు సీఫుడ్స్ అంటే ఇష్టమైతే మీరు ష్రింప్ డ్రై మసాలాను ట్రై చేయవచ్చు . మీకోసం ఒక స్పైసీ ష్రింప్ డ్రై మసాలా....

Dry Masala Shrimps Recipe

కావల్సిన పదార్థాలు:
వైట్ చిన్నరొయ్యలు: 250gms
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 3-4 (చిన్న ముక్కలుగా తరిగివి)
టమోటో: 2
పసుపు: 1tsp
టమోటా సాస్: 1tsp
కారం: 1tsp
జీలకర్ర పొడి: చిటికెడు
గరం మసాలా: చిటికెడు
నిమ్మరసం: 1tbsp
ఉప్పు: రుచికి
ఆయిల్: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా వైట్ గా ఉండే చిన్న రొయ్యలను నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత కొద్దిగా నిమ్మరసం, మరియు సాల్ట్ వేసి, మ్యారినేట్ చేసి 20నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3. అంతలోపు ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడి చేయాలి.
4. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాల పాటు మీడియం మంట మీద వేగించుకోవాలి.
5. మిక్సీలో టమోటోలను వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. ఇప్పుడు పసుపు మరియు ఉప్పు వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి, ఒక నిముషం వేగించిన తర్వాత అందులో టమోటో పేస్ట్ కూడా వేయాలి.
7. బాగా మిక్స్ చేస్తూ మరో 2,3నిముషాలు వేగించుకోవాలి. ఇప్పుడు అందులో రెడ్ చిల్లీ పౌడర్, జీలకర్ర, టమోటో సాస్ మరియు గరం మసాలా వేసి వేగించాలి.
8. ఇప్పడు అందులో ముందుగా నిమ్మరసంలో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న వైట్ కలర్ చిన్నని రొయ్యలను వేసి మరో 5-6నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. అంతే తినడానికి డ్రై మసాలా ష్రింప్ విత్ టమోటో సాస్ రెడీ. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, తర్వాత వేడిగా సర్వ్ చేయాలి.

English summary

Dry Masala Shrimps Recipe

Prawns or shrimps are one of the most popular seafood that is very much cherished. Prawns are great supplier of proteins and low in fat and calories which make them a healthy food. Prawns are low in saturated fat (which is responsible for raising bad cholesterol levels in the body).
Story first published: Tuesday, December 24, 2013, 17:59 [IST]
Desktop Bottom Promotion