For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ అండ్ క్రిస్పీ కేరళ చికెన్ ఫ్రై రిసిపి

|

కేరళ స్టైల్ చికెన్ ఫ్రైని లచ్ లేదా డిన్నర్ కు స్పెషల్ గా తీసుకోవచ్చు. ఇది ఒక ఇండియన్ డిష్.దీన్ని కొన్ని మసాలా దినుసులతో తయారుచేస్తారు. అంతే కాదు ప్రత్యేకంగా ఈ వంటకు కొబ్బరినూనెను ఉపయోగిస్తారు.

ఎటువంటి సందేహం లేకుండా చాలా సింపుల్ గా మరియు చాలా సులభంగా ఈ వంటను తయారుచేసుకోవచ్చు . ఈ వంటను మళయాలీయులు ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకే ఈ వంట సౌత్ ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి వంట అందుకే దీన్ని కేరళాలో ‘నందన్ చికెన్ ఫ్రై' అని పిలుస్తారు . మరి స్పెషల్ కేరళ స్టైల్ చికెన్ ఫ్రై ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Easy and Crisp Kerala Chicken Fry Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1/2kg(కట్ చేసి, శుభ్రం చేసి ఉడికించుకోవాలి)
సోంపు: 2tbsp
ఎండు మిర్చి: 5-6(మద్యలోకి కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 6-7
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా సోంపు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు మరియు కరివేపాకును మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత ఈ పేస్ట్ ను చికెన్ ముక్కలకు పట్టించాలి.
3. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ఒక గంట పక్కన పెట్టుకోవాలి.
4. చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టిన తర్వాత స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో కొబ్బరి నూనె వేసి వేడిచేయాలి.
5. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
6. అంతే కేరళ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ . ఇది రైస్ అండ్ రోటీస్ కు సైడ్ డిష్ గా ఉంటుంది. దీనితో పాటు ఉల్లిపాయ ముక్కలను సర్వ్ చేయాలి.

English summary

Easy and Crisp Kerala Chicken Fry Recipe

Kerala style chicken fry is something you would love to try out for lunch or dinner. It is an Indian dish that is prepared with few spices, and is deep fried in coconut oil.
Story first published: Thursday, October 30, 2014, 18:16 [IST]
Desktop Bottom Promotion