For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వావ్ చికెన్ స్వీట్ కార్న్ గ్రేవీ: వీకెండ్ స్పెషల్

|

వీకెండ్ వచ్చేసింది..వెరైటీగా చికెన్ రిసిపి తినడానికి మీరు రెడీనా...? మరి ఈ సండే మీకోసం ఒక వైరైటీ చికెన్ రిసిపిని పరిచయం చేస్తున్నారు . ప్రతి ఒక్కరూ వారి వీకెండ్ ను చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు . మరి మీరు ఈ వీకెండ్ సెలబ్రెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ టిప్ ఇక్కడ ఇస్తున్నాము .

స్వీట్ కార్న్, మరియు చికెన్ కాంబినేషన్ వంట చాలా వెరైటీగా స్పెషల్ గా ఉంటుంది. టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తయారుచేయడం కూడా చాలా సులభం. అతి తక్కువ సమయంలో రెడీ అవుతుంది. మరి బేసిక్ పదార్థాలతో ఈ సూపర్ ఫుడ్స్ ను చిటికెలో తయారుచేసుకొని టేస్టీగా సండేను ఎంజాయ్ చేసేద్దాం...

Easy And Tasty Chicken Sweet Corn Gravy Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్ - 500 g
స్వీట్ కార్న్ - 1 cup
గరం మసాలా పౌడర్ - 1 teaspoon
కారం - 1 teaspoon
ధనియాలపొడి - 1 teaspoon
ఉల్లిపాయలు - 1 cup
అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ - 1 teaspoon
జీడిపప్పు - 1 cup
సన్నగా తరిగిన టమోటోలు - 1cup
నిమ్మరసం- 2 teaspoons
నూనె సరిపడా
ఉప్పు : రుచికి తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా జీడిపప్పు, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ సుకోవాలి. జీడిపప్పుతో పాటు టమోటోలను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో నూనె వేసి శుభ్రచేసిన చికెన్ ముక్కలు వేసి , షాలో ఫ్రై చేసుకోవాలి.
3. చికెన్ కొద్దిగా వేగిన తర్వాత అందులో స్వీట్ కార్న్ వేసి వాటిని కూడా చికెన్ తో కలిపి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ,జీడిపప్పు, టమోటో పేస్ట్ వేసి ఫ్రై చేసి, కొద్దిగా నీరు జోడించి ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే ఫ్రైడ్ చికెన్ మరియు స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత గరం మసాలా , ధనియాలపొడి రెడ్ చిల్లీపౌడర్ వేసి , సరిపడా సాల్ట్ మరియు నిమ్మరసం మిక్స్ చేసి ఉడికించుకోవాలి.
7. మొత్తం మిశ్రమం పదినిముషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే చికెన్ కార్న్ గ్రేవీ రిసిపి రెడీ.

English summary

Easy And Tasty Chicken Sweet Corn Gravy Recipe

Yes, it's friday again and this is one day that we all wait for throughout the week. Everyone wants to make the best use of their weekend. So, here we give you the best tip to celebrate your weekend.
Story first published: Saturday, March 12, 2016, 14:20 [IST]
Desktop Bottom Promotion