For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్ అండ్ చీజ్ పరోటా రిసిపి : స్పెషల్ టేస్ట్

|

నార్త్ ఇండియన్ రిసిపిలలో పరాటా చాలా ఫేమస్. అయితే తర్వాత తర్వాత సౌత్ ఇండియాలో కూడా బాగా పాపులర్ అయింది. పరాటాల యొక్క రుచి మరియు పరాటాల్లో వివిధ రకాలు కలిగి ఉండటమే అందుకు కారణం . అయితే వీటిలో సహజంగా ఎప్పుడూ తయారుచేసుకొనే వంట ఆలూ పరాటా, క్యాబేజ్ పరాటా మరియు ఆనియన్ పరాటా.

అయితే వీటన్నింటికి కాస్త డిఫరెంట్ గా కొత్త రుచితో ఈ రోజూ మీకోసం ఎగ్ అండ్ చీజ్ పరోటాను పరిచయం చేయడం జరిగింది. ఎగ్ చీజ్ పరాటాలతో పేరుతోనే టేస్ట్ బడ్స్ ను టెంప్ట్ చేస్తున్నాయి. మరి అలాంటి టేస్టీ డిఫరెంట్ స్టైల్ పరాటోను మీరు కూడా రుచి చూడాలంటే దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Egg And Cheese Paratha Recipe

గుడ్డు - 2 (Boiled and grated)
చీజ్ - 200 grm (తురిమిన)
మైదా - 2 కప్పు
గోధుమ పిండి - 2cups
ఉల్లిపాయలు - 1cup

READ MORE: సాదాపరోటా బోర్ కొట్టిందా?ఉల్లిపాయ పరోటా తినండి

పచ్చిమిర్చి - 4 నుండి 5 (సన్నగా కట్ చేసుకోవాలి)
గరం మసాలా - 1/2tsp
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా కట్ చేసుకోవాలి)
జీలకర్ర - 1/4 tsp
నూనె - 1cup
వెన్న - కొద్దిగా
సాల్ట్ : సరిపడా

READ MORE: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ : మేతి పరోటా రిసిపి

తయారుచేయు విధానం:
1. ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా వేసి, అందులో ఉప్పు, నీళ్ళు వేసి పిండిని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పారాటా కోసం స్టఫ్ ను సిద్దం చేసుకోవాలి. అందుకోసం స్టౌ మీద పాన్ పెట్టి, అందులో కొద్దిగా జీలకర్ర వేసి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మరియు గరం మాలా వేసి లైట్ గా వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే ముందుగా ఉడికించి సన్నగా తరిగి పెట్టుకొన్న గుడ్డు మరియు చీజ్ కూడా వేయాలి.
4. అందులోనే రుచికి సరిపడా ఉప్పు మిరయు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేయాలి.
5. తర్వాత ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి తీసుకొని దాన్ని 5 సమ భాగాలుగా తీసుకొని, ఒక్కో దాన్నిచిన్న సైజు చపాతీల్లా రోలింగ్ కర్రతో రోల్ చేసుకోవాలి.
6. ఇప్పుడు ఒక్కో చపాతీలో స్టఫింగ్ కు సిద్దం చేసుకొన్న వాటిని నాలుగు వైపుల నుండి కవర్ చేయాలి. ఇలా అన్నీ స్టఫ్ చేసుకన్న తర్వాత ఒక్కోదాన్ని చపాతీ కర్రతో పరోటాల్లా వత్తుకోవాలి .
7. ఇలా వత్తుకొన్న పరాటాలన్ పాన్ మీద వేసి రెండు వైపులా బట్టర్ వేసి ఫ్రై చేసుకోవాలి . రెండు వైపులా బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి. అంతే ఎగ్ అండ్ చీజ్ పరోటా రెడీ దీన్ని పికెల్ లేదా పెరుగుతో సర్వ్ చేసుకోవాలి.

English summary

Egg And Cheese Paratha Recipe/Telugu Vantalu /Andhra Vantalu/ non vegetarian recipes

Parathas are very famous in North India. But off late, they have become popular even in south India. Of course, they are tasty and they come in several varieties. Some of the common varieties are the aloo parathas, cabbage parathas and onion parathas.
Story first published: Wednesday, November 18, 2015, 14:45 [IST]
Desktop Bottom Promotion