For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ అండ్ టేస్టీ మష్రుమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్

|

మనకందరికీ నచ్చిన చాలా ఫేవరెట్ డిష్ లలో ఎక్కువ ఇష్టమైనది మరియు అతి త్వరగా తయారుచేసుకొనే రైస్ ఐటమ్ ఫ్రైడ్ రైస్. ముఖ్యంగా ఎగ్ ఫైడ్ రైస్ చాలా సులభంగా, అతి త్వరగా మరియు టేస్టీగా పూర్తి న్యూట్రీషియన్స్ తో తయారయ్యే వంట ఎగ్ ఫ్రైడ్ రైస్. అయితే ఎప్పుడూ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా మష్రుమ్ జోడిస్తే మరింత టేస్ట్ మరింత ఆరోగ్యం.

మష్రుమ్(పుట్టగొడుగులు)తినడానికి రుచి మాంసాహారంలాగే ఉంటుంది. కానీ పక్కా వెజిటేరియు వెజిటేబుల్, ఎగ్ మరియు మష్రుమ్ ను ఇక్కడ ఉపయోగించి కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో తయారుచేస్తున్నాం. ఫ్రైడ్ రైస్ చాలా మందికి ఇష్టమైన రుచికరమైన డిష్. అలాగే ఈ మష్రుమ్ మరియు ఎగ్ ఫ్రైడ్ రైస్ ను కూడా చాలా మంది ఇష్టపడుతారు. మీకుటుంబ సభ్యులతో పాటు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మష్రుమ్ రుచి మరియు సువాసన చాలా ఘాటుగా కొత్త రుచి ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు ఒక కొత్త ట్రీట్ అనిపించవచ్చు. కాబట్టి, ఈ రుచికరమైన నాన్ వెజిటేరియన్ రిసిపి తయారుచేయడానికి ఇది ఒక మంచి సమయం. మరి దీన్ని ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం..

Healthy & Tasty Mushroom Egg Fried Rice Recipe

కావల్సిన పదార్థాలు:
మష్రుమ్ - 10 to 15 (neatly sliced)
గుడ్లు - 2
అన్నం - 1 bowl
పచ్చిమిర్చి - 5 to 6 (chopped)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 teaspoon
వెనిగర్ - 1 tablespoon
స్ప్రింగ్ ఆనియన్ - 1 cup
చిల్లీ సాస్ - 1 tablespoon
టమోటో సాస్ - 1 tablespoon
సోయాసాస్ - 1 tablespoon
జీలకర్ర - 1/2 tablespoon
కొత్తిమీర - 1/2 cup (chopped)
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- తగినంత

తయారుచేయు విధానం:
1. పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగించాలి.
2. తర్వాత అందులో పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి.
3. ఇప్పుడు అందులో మష్రుమ్ మరియు గుడ్లు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత సాస్ లు ఒకదాని తర్వాత ఒకటి వేసి కొద్దిసేపు అలాగే సోక్ చేయాలి .
5. తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్న వేసి మొత్తం మిశ్రమం కలగలిసేలా మిక్స్ చేస్తూ చేసుకోవాలి .
6. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే వెనిగర్, రుచికి సరిపడా కొద్దిగా ఉపు వేసి మిక్స్ చేసుకోవాలి.
7. గార్నిషిగ్ కోసం కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి . అంతే హెల్తీ అండ్ టేస్టీ మష్రుమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ...

English summary

Healthy & Tasty Mushroom Egg Fried Rice Recipe

Mushrooms are very healthy and tasty too. Many of them like to eat mushrooms and would also love to include them in their daily meals. So, today, we shall share with you an easy mushroom and egg fried rice recipe. The combination of mushroom and egg is just awesome. There are several health benefits of mushrooms.
Story first published: Saturday, April 23, 2016, 11:32 [IST]
Desktop Bottom Promotion