For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోం మేడ్ రవ్వ ఫిష్ ఫ్రై: అద్భుతమైన రుచి

|

ఫిష్ ప్రై అంటే నాన్ వెజిటేరియన్స్ అందరికీ చాలా ఇష్టమైన సీ ఫుడ్. ఫిష్ ఫ్రై అంటేనే ఇది చాలా క్రిస్పీగా మరియు టేస్టీగా ఉంటుంది. మరియు కాస్త వెరైటీగా చేసుకుంటే రెస్టారెంట్ టేస్ట్ ను మరిపిస్తాయి. రవ్వ ఫిష్ కర్రీని ఎక్కువగా బయట రెస్టారెంట్స్ లో ఎక్కువగా తయారుచేస్తుంటారు.

రవ్వ ఫిష్ ఫ్రై, హోం మేడ్ ఫిష్ ఫ్రై డిష్ . ఇది ఏ రెస్టారెంట్ కైనా, కేఫ్ మెనుకైనా కాంపిటీషన్ ఫుడ్ . ఫిష్ ఫ్రైకి రవ్వను ఉపయోగిస్తారు. రవ్వ ఫిష్ క్రిస్పీగా మరియు అద్భుతమైన రుచి కలిగి ఉటుంది . దీన్ని చాలా సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవ్చు. మరి మీరు కూడా ట్రై చేయాలంటే క్రింది పద్దతిని అనుసరించండి..

Homemade Rava Fish Fry Recipe

కావల్సిన పదార్థాలు:
ఫిష్ (Surmai) : 8ముక్కలు
నిమ్మరసం: 2tbsp
కరివేపాకు: 5
ఎండు మిర్చి: 5
జీలకర్ర: 1tsp
పచ్చిమిర్చి: 4
గసగసాలు: 1tsp
వాము: 1చిటికెడు
వెల్లుల్లి : 5
అల్లం: ½ అంగుళం
జీలకర్ర: 1tsp
రవ్వ లేదా సెమోలినా: 1cup
నూనె: 3tbsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. చేప ముక్కలను శుభ్రంగా కడి తేమ ఆరిన తర్వాత వాటికి ఉప్పు మరియు నిమ్మరసం మిక్స్ చేసి చేపలకు పట్టించాలి.
2. పదినిముషాలు ఈ చేప ముక్కలను రిఫ్రిజరేటర్లో పెట్టాలి. అంతలోపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, జీలకర్ర మరియు ధనియాలు వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. తర్వాత ఫ్రిజ్ లోని చేపముక్కలు భయటకు తీసి ఈ చిక్కటి మసాలా పేస్ట్ చేపముక్కలకు రెండు వైపులా అప్లై చేయాలి. మసాలా పట్టించిన తర్వాత కూడా 10 నిముషాలు అలాగే పెట్టాలి.
4. తర్వాత ఒక ఫ్లాట్ పాన్ స్టౌ మీద పెట్టి, వేడయ్యాక కొద్దగా నూనె వేసి, వేడి చేయాలి. తర్వాత అందులో అజ్వైన్ మరియు కరివేపాకు వేసి వేయించాలి.
5. అంతలోపు, చేపముక్కలను రవ్వలో పొర్లించి అన్ని వైపులా రవ్వ అంటుకొనేలా చేయాలి. తర్వాత ఈ చేపముక్కలను పాన్ లో వేసి తక్కువ మంట మీద 15నిముషాలు వేయించుకోవాలి.
6. అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
7. బ్రౌన్ కలర్ లోకి మారగానే వాటిని తీసి, సర్వింగ్ ప్లేట్ లో వేసి, కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయాలి. అంతే హోం మేడ్ రవ ఫిష్ ఫ్రై రెడీ.

English summary

Homemade Rava Fish Fry Recipe

Fish fry is a delicacy that we rarely enjoy at home. The concept of fried fish usually reminds us of the crisp and batter fried fish that we bite into at restaurants. However, rava fish fry is a dish that is just as crisp as the fried fish that we try outside home.
Story first published: Thursday, March 6, 2014, 17:39 [IST]
Desktop Bottom Promotion