For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ చికెన్ బిర్యానీ తయారీ : వీడియో..!

By Super Admin
|

చికెన్ బిర్యానీ పేరు వింటేనే వెంటనే తినాలనిపిస్తుంది కదా.ఈ వంటకం తన రుచితో ఎనిమిదేళ్ళ పిల్లల నుండీ ఎనభై ఏళ్ళ ముదుసలి వరకూ అందరినీ నోరూరిస్తుంది.పెళ్ళి కావచ్చు లేదా ఈద్ పార్టీ కావచ్చు సందర్భం ఏదైనా సరే బిర్యానీ ఉంటే అతిధులకీ మరేమీ అక్కర్లేదు.

బిర్యానీ అవధ్ తరహా వంటకం.కానీ హైదరాబాదీ బిర్యానీ తయారీ మరియూ రుచి రెండూ స్పెషలే.కోల్కతా బిర్యానీలో ఆలూ, చికెన్ లేదా ఇతర మాంసం కాస్త ఘాటుగా ఉండే అన్నంతో కలిసి ఒక రకమైన రుచి వస్తుంది.

ఒక్కో ప్రాంతన్లో బిర్యానీ ఒక్కో రుచిలో ఉంటుంది.అసలు సిసలు చికెన్ బిర్యానీ తయారు చేసి మీ అతిధులని ఆశ్చర్య పరుద్దామనుకుంటే ఆలశ్యం చెయ్యకుండా క్రింద ఇచ్చిన తయారీ విధానాన్ని పాటించండి.

ఎంత మందికి సరిపోతుంది-6

కావాల్సిన పదార్ధాల తయారీకి-2 గంటలు

వండటానికి-ఒక గంట

కావాల్సిన వస్తువులు:

1.చికెన్-500 గ్రాములు(బోన్ లెస్)

2.పసుపు-ఒక టీ స్పూను

3.పెరుగు-ఒక కప్పు

4.గరం మసాలా-ఒక టీ స్పూను

5.కారం-2 టేబుల్ స్పూనులు

6.ఉప్పు-తగినంత

7.అల్లం పేస్టు-ఒక తేబుల్ స్పూను

8.వెల్లుల్లి పేస్టు-ఒకటిన్నర టేబుల్ స్పూను

9.నెయ్యి-3 టేబుల్ స్పూన్లు

10.వేయించిన ఉల్లిపాయలు-ఒక కప్పు

11.బాస్మతీ రైస్-నానబెట్టినది 2 కప్పులు

12.మసాల దినుసులు-తగినన్ని

13.డ్రై ఫ్రూట్స్-సన్నగా తరిగినవి ఒక కప్పు

14.కుంకుమ పువ్వు నీరు-2 టేబుల్ స్పూన్లు

15.రోజ్ వాటర్-ఒక టేబుల్ స్పూన్లు

16.కేవ్రా వాటర్-ఒక టేబుల్ స్పూను

తయారీ విధానం:

1.చికెన్ ముక్కలని ఒక గిన్నెలో తీసుకుని దానిలో పెరుగు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా వెయ్యాలి.

Prepare Tasty Chicken Biryani

2.ఇలా చికెన్ ముక్కలని మారినేట్ చేసి 2 గంటలపాటు పక్కనుంచాలి.

Prepare Tasty Chicken Biryani

3.ఒక లోతైన మూకుడు తీసుకుని దానిలో నెయ్యి వేసి వేడి చేసి మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని వెయ్యాలి.

Prepare Tasty Chicken Biryani

4.వేయించిన ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్ వేసి చికెన్ సగం ఉడికే వరకూ స్టవ్ మీద ఉంచాలి.

Prepare Tasty Chicken Biryani

5.ఒక పాన్ తీసుకుని దానిలో నీళ్ళు పోసి వేడి చేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు మసాలా దినుసులు వెయ్యాలి.

Prepare Tasty Chicken Biryani

6.దీనిలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి 80% ఉడికించుకోవాలి.

Prepare Tasty Chicken Biryani

7.ఇప్పుడు వేయించుకున్న చికెన్ ముక్కలని ఒక లోతైన గిన్నెలో పేర్చి పైన ఉడికిన అన్నాన్ని వేసి పొరలుగా పేర్చాలి.

8.దీనిలో కుంకుమ పువ్వు నీరు, రోజ్ వాటర్,కేవ్రా వాటర్,డ్రై ఫ్రూట్స్, వేయించిన ఉల్లిపాయలు,తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి చుట్టూ అల్యూమినియం ఫాయిల్తో చుట్టాలి.

Prepare Tasty Chicken Biryani

9.చికెన్ బిర్యానీని ఇంకా సహజంగా చెయ్యాలనుకుంటే గిన్నె మూతకి గోధుమ పిండి పూసి సీల్ చెయ్యాలి.

10.ఇప్పుడు బిర్యానీని ఇలా 20 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి.

11.గిన్నెలో నుంచి సువాసన వచ్చినప్పుడు స్టవ్ ఆపాలి. అంతే మీ చికెన్ బిర్యానీ రెడీ.

Prepare Tasty Chicken Biryani

ఈ వారాతంలో కనుక మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంటే చికెన్ బిర్యానీ వండి మీ అతిధులని ఆశ్చర్య పరచండి.ఈ రుచికరమైన బిర్యానీ తిని వాళ్ళెంత ఆనందిస్తారో మీరే చూద్దురుగాని.సులభంగా చేసే ఈ రుచి కరమైన ఈ చికెన్ బిర్యానీ తయారీని మీ స్నేహితులతో పంచుకోవడం మర్చిపోవద్దు సుమా.

English summary

How To Prepare Tasty Chicken Biryani: Video

The name is enough to make you wanting to eat it right away. Chicken biryani is such a delicacy, which woos everyone – from eight to eighty years. Whether it is a wedding ceremony or an Eid party or any other occasion, if biryani is there, people want nothing else.
Story first published:Friday, November 4, 2016, 14:04 [IST]
Desktop Bottom Promotion