For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ కాజు చికెన్ మసాలా

|

మీల్స్ లో టేస్టీ ట్రీట్ కావాలనుకుంటున్నారా...చాలా రుచికరంగా మరియు స్పైసీగా ఉండే కాజు చికెన్ రిసిపి . చికెన్ తయారుచేయడానికి అవసరం అయ్యే మసాలా దినుసులతో చాలా టేస్టీగా తయారుచేయవచ్చు.

ఈ వంటను చాలా సులభంగా మరియు చాలా త్వరగా తయారుచేయవచ్చు . ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ను, క్రీమి టెక్చర్ ను కలిగి ఉంటుంది. ఇందులో మసాలా దినుసులు ఉపయోగించడం వల్ల మంచి ఆరోమా వాసను ఇస్తుంది. కాజు, మరియు గసగసాల పేస్ట్ , పాలు జోడించడం వల్ల క్రీమీ స్ట్రక్చర్ ఇస్తుంది. ఇది మరింత టేస్ట్ గా ఉంటుంది. మరి ఈ స్పైసీ డిష్ ను మీరు టేస్ట్ చూడాలంటే, తయారుచేసే పద్దతిని చూడండి...

Indian Cashew Chicken Masala

కావలసిన పదార్ధాలు:
చికెన్: 1/2kg
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
కరివేపాకు: ఒక రెమ్మ
కాజూ: 1/2cup
కొత్తిమీర: 1cup
నూనె: తగినంత
ఉప్పు, కారం: రుచికి తగినంత
పసుపు: 1/2tsp
అల్లంవెల్లుల్లి ముద్ద: 2tbsp
మసాలాకు
లవంగాలు: 6
చెక్క: చిన్న ముక్క
జీలకర్ర: 1tsp
ధనియాలు: 1tbsp
గసగసాలు: 2tsp
పాలు: 2tbsp

తయారు చేసే విధానం :
1. ముందుగా చికెన్ లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి ఒక అరగంట ఫ్రిజ్ లో ఉంచాలి.
2. మసాలా దినుసులు అన్ని మెత్తగా పొడి కొట్టుకోవాలి.పది జీడిపప్పులు కూడా పొడి చేసుకోవాలి. నూనె వేడిచేసి మిగిలిన కాజూ వేయించి తీసుకోవాలి.
3. ఇప్పుడు అదే నూనెలో తరిగిన కొత్తిమీర, మిర్చి, తగినంత కారం వేసి దోరగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
4. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్దవేసి పచ్చివాసన పోయేవరకు వేయించి, మసాలా పొడి, పసుపు కూడా వేసి బాగా కలిపి రెండు నిముషాలు వేయించాలి.
5. ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి సన్ననిసెగపై అయిదు నిమిషాలు ఉడికించి,తగినంత ఉప్పు, ఒక కప్పు నీళ్ళు కలిపి మూత పెట్టి ఉడికించాలి. 6. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత కాజూ పొడి, వేయించిన కాజూ కలిపి కూర బాగా దగ్గరయ్యే వరకు ఉడికించి దించెయ్యాలి. ఒక బౌల్ లోకి తీసుకుని కొంచెం కొత్తిమీర చల్లితే ఎంతో రుచిగా ఉండే చికెన్ కాజూ కుర్మా రెడీ అవుతుంది.

English summary

Indian Cashew Chicken Masala

Indian Kaju Chicken Masala, Here is an indian cashew chicken masala recipe which is very delicious. Serve over brown basmati rice or with chapatis.
Story first published:Thursday, January 28, 2016, 17:29 [IST]
Desktop Bottom Promotion