For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండో చైనీస్ చిల్లీ గార్లిక్ చికెన్ రిసిపి

|

ప్రస్తుత రోజుల్లో చైనీస్ ఫుడ్ ను ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు . ఎక్కువగా రెస్టారెంట్స్ లో ఈ చైనీస్ ఫుడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఈ చైనీస్ ఫుడ్స్ ముందుగా స్ట్రీట్ ఫుడ్ గా బాగా ఫేమస్ అయ్యింది. చైనీస్ ఫుడ్స్ కాస్త మన ఇండియన్ స్టైల్లో మన ఇండియన్ మసాలా దినుసులను ఉపయోగించి తయారుచేస్తారు.

సహజంగా చైనీస్ ఫుడ్ తయారుచేయడానికి చాలా తక్కువ మసాలాలను ఉపయోగిస్తుంటారు. అయితే చైనీస్ ఫుడ్ ను ఇండియన్ టేస్ట్ కు తగ్గట్లు ఇండియన్ స్టైల్లో తయారుచేయడానికి కొన్ని మసాలాలను దంటించి తయారుచేస్తారు. అందుకే దీన్ని ఇండో చైనీస్ గార్లిక్ చిల్లీ చికెన్ అని పిలుస్తారు. ఇంకా మరింత రుచికరంగా ఉండటం కోసం ఈ వంటకు కొన్ని రకాల సాస్ లను ఉపయోగించడం జరిగింది. మరి ఈ స్పెషల్ చికెన్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Indo-Chinese Chilli Garlic Chicken Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్ - 500 గ్రాముల
నిమ్మరసం: 1tbsp
బ్లాక్ పెప్పర్: 2tsp(పొడి చేసుకోవాలి)
చిల్లీ ప్లాక్స్(ఎండు మిర్చి పొడి) : 1tsp
చిల్లీ గార్లిక్ పేస్ట్ : 1 tbsp
కార్న్ ఫ్లోర్: 2tbsp
ఎగ్ వైట్: 1
వెల్లుల్లి: 3tbsp(దంచుకోవాలి)
అల్లం : 1 tsp(దంచుకోవాలి)
ఉల్లిపాయ : 1/2cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
సోయా సాస్: 2tbsp
టమోటో సాస్: 1/3cup
నూనె: 1 tbsp
చక్కెర : 1tbsp
నూనె: డీఫ్ ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను నీటితో బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో శుభ్రం చేసుకొన్న చికెన్, నిమ్మరసం, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఎగ్ వైట్, కార్న్ ఫ్లోర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి 20 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3. 20 నిముషాల తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో మ్యారినేట్ చికెన్ ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మ్యారినేట్ చేసుకోవాలి.
4. తర్వాత మరో పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దంచి పెట్టుకొన్న అల్లం, వెల్లుల్లి వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మూడు, నాలుగు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. దాని తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, టమోటో సాస్, పంచదార, వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు అందులో ఉప్పు, మరియు ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి .
8. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ మరియు నీరు వేసి పాన్ లో వసి మిక్స్ చేసుకోవాలి.
9. మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఇండో చైనీస్ గార్లిక్ చిల్లీ చికెన్ రెడీ. ఇది ఫ్రైడ్ రైస్ లేదా నూడిల్స్ కు చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Indo-Chinese Chilli Garlic Chicken Recipe

Chinese street food is what we all love more than the authentic dim sums and soups that we get in posh restaurants. This is because we get the mix of Indian and Chinese spices only out on the streets. This is what makes them delectable to the Indian taste buds because we love the spice in our food.
Story first published: Monday, December 15, 2014, 14:18 [IST]
Desktop Bottom Promotion