For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లగాన్ కా ముర్గ్ : స్పైసీ చికెన్ రిసిపి

|

లగాన్ కా ముర్గ్ స్పైసీ మరియు టేస్టీ చికెన్ కర్రీ రిసిపి. ఇది ఒక మోస్ట్ పాపులర్ హైదరాబాదీ రిసిపి. వివిధ రకాల ఇండియాన్ మసాలా దినుసులతో తయారుచేసే ఈ హైదరాబాదీ చికెన్ రిసిపి మంచి ఫ్లేవర్ తో పాటు, అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. మసాలాలను ముందుగా వేయించుకొని మ్యారినేట్ చేయడం వల్ల అంత అద్భుతమైన రుచి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ఈ టేస్టీ అండ్ స్పైసీ రిసిపి తయారుచేయడానికి కొంత సమయం పడుతుంది.

ఈ ముర్గ్ రిసిపి తయారుచ చేయడం చాలా సులభం. ఈ ముర్గ్ రిసిపికి ఎర్రగా నోరూరిస్తూ ఉంటుంది. అందుకు అందులో జోడించే టమోటో గుజ్జు మరియు కారం. ఈ లగాన్ కా ముర్గ్ రిసిపిని అకేషనల్ గా లేదా అథితులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా తయారుచేయవచ్చు. మరి మీరు కూడా ఈ స్పైసీ చికెన్ కర్రీని టేస్ట్ చేయాలంటే తయారుచేసే విధానం తెలుసుకోవాల్సిందే...

Lagan Ka Murg: A Spicy Chicken Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్ ముక్కలు: 1kg
కొబ్బరి పౌడర్: ¾cup
జీడిపప్పు 10-12
గసగసాలు 2-3tbsp
టమోటో గుజ్జు: 2 ½ cups
పచ్చిమిర్చి పేస్ట్ 1-2tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1-2tbsp
కొత్తిమీర పొడి: 2tsp
జీలకర్ర పొడి: 1tsp
గరం మసాలా: 1tbsp
నెయ్యి: 1tbsp
పెరుగు 2cups
కొత్తిమీర తరుగు: 3tbsp
మింట్ లీవ్స్(పుదీనా):1tbsp
కూరగాయల నూనె: 2-3tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొబ్బరి పొడి, జీడిపప్పు, మరియు గసగసాలు వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద రెండు మూడు నిముషాలు ఫై చేసుకొన్నాక పక్కన తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి.
2. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే టమోటో గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్రపొడి, గరం మసాలా, నెయ్యి, పెరుగు, కొత్తిమీర తరుగు, పుదీన మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు స్టౌ మీద మరో పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడయ్యాక, మంటను మీడియంగా పెట్టి, చికెన్ మిశ్రమాన్ని అందులో వేయాలి.
5. రెండు మూడు నిముషాలు ఎక్కువ మంట మీద వేగించుకొని తర్వాత మంటను మీడియంగా పెట్టి మరో 5నిముషాలు వేగించిన తర్వాత 1-2కప్పుల నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు మూత పెట్టి 15-20నిముషాల పాటు అతి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చికెన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే లగాన్ కా ముర్గ్ రెడీ. రోటీ లేదా రైస్ తో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

English summary

Lagan Ka Murg: A Spicy Chicken Recipe

Lagan ka murg is an extremely spicy and tasty chicken curry recipe. This is one of the most popular Hydrebadi chicken recipes. The awesome flavour of this chicken recipe comes from the fact that the spices are first roasted and then added to this tasty dish. You do not need much time for this chicken curry recipe.
Story first published: Wednesday, March 19, 2014, 18:16 [IST]
Desktop Bottom Promotion