For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లిప్ స్నాకింగ్ ఫ్రైడ్ చికెన్ నూడిల్స్ రిసిపి

|

ఈ మోడ్రన్ ప్రపంచంలో ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కవుగా ఇష్టపడుతున్నారు. జీవనశైలిలో అనేక మార్పులతో పాటు, ఆహారపు అలవాట్లలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి . అందుకే ఫాస్ట్ ఫుడ్స్ అంటే అంతే క్రేజ్. ఫాస్ట్ ఫుడ్స్ బాగా పాపులర్ అయినాయి. ఫాస్ట్ ఫుడ్స్ లో టేస్టీ ఫుడ్స్ లో నూడిల్స్ కూడా ఒకటి. నూడిల్స్ ను వివిధ రకాలుగా తయారుచేసుకుంటారు.

ఈ రోజు మీకోసం ఒక సింపుల్ అండ్ టేస్టీ, స్పైసీ చికెన్ నూడిల్స్ ఫ్రైని పరిచయం చేస్తున్నా. ఈ రిసిపిని లంచ్, బ్రేక్ ఫాస్ట్ లేదా ఈవెనింగ్ స్నాక్ గా కూడా తయారుచేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీ నూడిల్ రిసిపి. మీరు రుచి చూడాలంటే ఒకసారి ప్రయత్నించి చూడవచ్చు . మరి ఈ టేస్టీ చికెన్ నూడిల్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Lip Smacking Fried Chicken Noodles Recipe: Telugu Vantalua

నూడుల్స్ - 200gms
చికెన్ ముక్కలు - 100 gms
ఉల్లిపాయలు - 1 cup (సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటా - 1cup (సన్నగా కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్ - 1 cup (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1tbps
పచ్చిమిర్చి - 4 5
బ్లాక్ మిరియాలు - 1tps
కారం - 1 tsp
సోయా సాస్ - 2 tsp
టమోటో సాస్ - 2 tsp
మిరప సాస్ - - 2 tsp
ఆయిల్: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నీళ్ళు సోసి వేడి అయ్యాక అందులో నూడిల్స్ వేయాలి.
2. నూడిల్స్ మెత్తగబడ్డాక వేడి నీటిని వంపేసి, చల్లనీళ్ళు పోసి, రెండు నిముషాల తర్వాత చల్లనీళ్ళు కూడా వంపేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడి అయ్యాక నూడిల్స్ వేసి కొద్ది సేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత మరో పాన్ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సన్నగా తరిగిపెట్టుకొన్న ఉల్లిపాయలు, టమాటో, క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో సన్నగా కట్ చేసిన చికెన్ ముక్కలు, సోయా సాస్, చిల్లీ సాస్, మరియు టమోటో సాస్, పెప్పర్ మరియు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
7. పది నిముషాలు ఫ్రై చేసుకొన్న తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకొన్న నూడిల్స్ వేసి మిక్స్ చేస్తూ మరో 10 నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
8. అంతే హాట్ అండ్ స్పైసీ ఫ్రైడ్ నూడిల్ రిసిపి రెడీ.

English summary

Lip Smacking Fried Chicken Noodles Recipe: Telugu Vantalua

Most of us love to eat noodles and there are many recipes that you have tried with noodles.But, today we shall teach a simple, tasty and quick fried noodles recipe. You can prepare this recipe either for lunch, breakfast or even as a snack.
Story first published: Wednesday, October 7, 2015, 13:26 [IST]
Desktop Bottom Promotion