For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మింట్ మటన్ గ్రేవీ(పుదీనా మటన్ కర్రీ)

|

వేసవికాలంలో ఎండ, వేడి వల్ల శరీరం నీటిని కోల్పోయి డీహైడ్రేషన్ అయి, బాడీ కూడా వేడి చేస్తుంది . అటువంటి పరిస్థితిలో మీ శరీరానికి చల్లదనాన్ని కలిగించే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. సమ్మర్ హీట్ ను బీట్ చేయడానికి కూలింగ్ పదార్థాలు ఎంపిక చేసుకోవాలి.

శరీరానికి చల్లదనం కలిగించే అటువంటి ఆహారాల్లో పుదీనా ఒకటి . సమ్మర్ డైట్ లో తప్పనిసరిగా పుదీనా చేర్చుకోవడం ఒక బెస్ట్ ఐడియా. పుదీనా మటన్ కర్రీ చాలా సింపుల్ గా రుచికరంగా, మంచి ఫ్లేవర్ తో అతి త్వరగా తయారు చేసుకోవచ్చు. అతి తక్కువ మసాలా దినుసులతో తాయరు చేసే మింట్ మటన్ కర్రీ టేస్ట్, ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుంది. మరి మీరూ పుదీనా ఫ్లేవర్ మటన్ కర్రీ రుచి చూడాలంటే ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం...

Mint Mutton Curry

కావల్సిన పదార్థాలు:
మటన్: 1/2kg
నూనె: సరిపడా
ఉల్లిపాయలు: 2(సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
టమోటోలు : 2(సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
దాల్చిన చెక్క: చిన్నముక్క
యాలకలు : 5
లవంగాలు: 10
పచ్చిమిర్చి: 10
పుదీనా: రెండు కట్టలు
కారం: రెండు చెంచాలు
ధనియాల పొడి: 3tsp
పసుపు: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
గరం మసాలా: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: ఒక కట్ట

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో యాలకలు, లవంగాలు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
2. ఒక నిముషం తర్వాత అందుంలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాలపొడి, పసుపు, గరంమసాలా వేసి మరోసారి కలపాలి.
4. ఇప్పుడు అందులోనే మాంసం ముక్కలు, టమోటో ముక్కలు, కరివేపాకు రెబ్బలు కూడా వేసి మంట తగ్గించి మూత పెట్టేయాలి.
5. ఈ ముక్కలు ఉడికేలోపు పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి తగినంత ఉప్పు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. మటర్ ముక్కలు ఉడికిన తర్వాత పుదీనా పేస్ట్ ను కూడా జోడించి, బాగా మిక్స్ చేసి నీళ్ళు పోసి మూత పెట్టేయాలి.
7. మటన్ ముక్కలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది.
8. అవసరం అయితే చివరగా కొద్దిగా పెప్పర్ పౌడర్ చిలకరిస్తే మరింత రుచికరంగా ఉంటుంది.

English summary

Mint Mutton Curry

Mutton curries are prepared in various methods in India. Some recipes are cooked with a lot of spices while others are comparatively bland. Spice blends are different for different regions and you can spot the origin of a dish by identifying the ingredients in it.A simple-to-prepare alternative to a traditional meat dish. Lamb/Mutton with Fresh Mint is a great dish for a warm lunch or dinner.
Story first published: Thursday, May 28, 2015, 13:00 [IST]
Desktop Bottom Promotion