For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముర్గ్ ధనియా కుర్మ రిసిపి: నాన్ వెజ్ స్పెషల్

|

ముర్గ్ ధనియా కుర్మ చాలా డిఫెరెంట్ చికెన్ రిసిపి. ఇది మరో నార్త్ ఇండియన్ చికెన్ రిసిపి. దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు ఈ చికెన్ రిసిపికి పెరుగు జోడించడం వల్ల చికెన్ మెత్తగా ఉడుకుతుంది మరియు కొత్తిమీ ఎక్కువగా జోడించడం వల్ల ఆరోమా వాసనతో నోరూరిస్తుంటుంది.

అలాగే అందులో వేసి బ్రౌన్ కలర్ ఉల్లిపాయలు కొద్దిగా స్వీట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. పచ్చిమిర్చి స్పైసీగా బిట్టర్ టేస్ట్ ను అందిస్తుంది. ఇది స్వీట్ అండ్ బిట్టర్ టేస్ట్ ను బ్యాలెన్స్ చేస్తూ మంచి రుచికరంగా ఉంటుంది . మీరు నార్మల్ చికెన్ రిసిపి తిని బోరుకొడుతుంటే, ఇలాంటి స్పైసీ చికెన్ రిసిపిని ప్రయత్నించవచ్చు. మరి ఈ ముర్గ్ ధనియా చికెన్ ఎలా తయారుచేయాలో చూద్దాం....

non veg

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg
కొత్తిమీర: 2కట్టలు (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
మసాలా పొడి: 2 tsp
అల్లం: 1 tbsp
తరిగిన వెల్లుల్లి: 1tbsp
తరిగిన పచ్చి మిరపకాయలు: 10
తరిగిన ఉల్లిపాయ: 2
నల్ల మిరియాలపొడి: 1 tsp
ఉప్పు: 1 cup
పసుపు: tsp
యోగర్ట్(పెరుగు): 1cup
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 1cup

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ఉల్లిపాయల ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. వేగించుకొన్న ఉల్లిపాయ ముక్కలు పక్కకు తీసి పెట్టుకోవాలి.. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక చికెన్ వేసి ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు వేగుతున్న చికెన్ లో పసుపు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి.
4. చికెన్ నుండి నూనె పైకి తేలే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు చికెన్ లో మసాలా పొడులన్నింటిని వేయాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత పెరుగులో ముందుగా వేగించుపెట్టుకొన్న ఉల్లిపాయముక్కలు వేసి మిక్స్ చేసి ఉడుకుతున్న చికెన్ లో పోసి మిక్స్ చేయాలి.
7. గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించాలి. గ్రేవీ చిక్కబడే సమయంలో సన్నగా తరిగిన కొత్తిమీర మరియు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేసి ఉడికించిచాలి.
8. మంటను తక్కువ పెట్టి 10 నిముషాలు ఉడికించిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి. అంతే ముర్గ్ ధనియా కుర్మ రెడీ ...

English summary

Murg Dhania Qorma Recipe: Telugu Vantalu

Murg Dhania Qorma Recipe: Telugu Vantalu, Murg Dhania Qorma is a different way to cook chicken. It is a north Indian chicken dish and is simple to prepare. The yoghurt added in it makes the chicken soft and fresh coriander gives it a unique aroma.
Story first published: Wednesday, August 5, 2015, 15:29 [IST]
Desktop Bottom Promotion