For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాంసాహార ప్రియుల కోసం : మటన్ దాల్చా-టేస్టీ అండ్ హెల్తీ

|

మటన్ దాల్చా చాలా టేస్టీ డిష్ . ముఖ్యంగా మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టమైన వంట ఇది. ఎందుకంటే, పప్పు దినుసులు మరియు మాంసంతో తాయరుచేసే ఈ వంట రుచి చాలా వెరైటీగా మరియు టేస్టీగా ఉంటుంది. అంతే కాదు, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. పప్పుదినుసులు మన ఆరోగ్యానికి అవసరం అయ్యే న్యూట్రీషిన్స్ ను అందిస్తే, మటన్ ప్రోటీనులను అందిస్తుంది.

కొన్ని ఇండియన్ మసాలా దినుసులు, పప్పు, మరియు మటన్ తో చేసే ఈ డిష్ రెగ్యులర్ మీల్స్ తో కూడా తీసుకుంటారు. అంతే కాదు, స్పెషల్ గా బిర్యానీ, మరియు పులావ్ వంటి వెరైటీ డిష్ లకు టేస్టీ సైడ్ డిష్ గా సర్వ్ చేస్తారు. మరి మీరు కూడా మటన్ దాల్చా రిసిపి టేస్ట్ చూడాలంటే ఎలా తయారుచేయాలో చూసేద్దాం...రండి....

Mutton Dalcha:Tasty and Healthy

కావలసిన పదార్థాలు:
మటన్ : 500grms
బేబీపొటాటో : 3
కందిపప్పు :1/4 cup
చనా ధాల్ / సెనగలు: 2tbsp
చిన్న ఉల్లిపాయలు : 2-3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటోలు(సన్నగా తరిగినవి) : 1/2
పచ్చి మిర్చి : 4
ధనియాల పొడి : 2 tsp
పసుపు పొడి : 1/4 tsp
గరం మసాలా పొడి : 1/4 tsp
ఉప్పు : రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: గార్నిష్ చేయడానికి సరిపడా
పోపుకోసం:
ఆవాల గింజలు : 1/4 tsp
జీలకర్ర : 1/2 tsp
దాల్చిన చెక్క : 1
లవంగాలు : 2
స్టార్ సొంపు : 1/2
బే ఆకు :1
నూనె : 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా కందిపప్పు మరియు శెనగపప్పు నీళ్ళలో వేసి 30నిముషాలు నానబెట్టుకోావలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో నానబెట్టుకొన్న పప్పు, మటన్ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ధనియాలపొడి, బేబీపొటాటో, టమోటో ముక్కలు, పసుపు, సరిపడా నీళ్ళు పోసి 5-6 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. తర్వాత చిన్న పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేసి ఒక నిముషం వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ప్రెజర్ కుక్కర్ లో ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి వేగుతున్న పోపులో పోయాలి.
5. 5నిముషాలు ఉడికించి, కొద్దిగా గరం మసాలా చిలకరించి , కొత్తమీర తరుగును కూడా వేసి బాగా మిక్స్ చేయాలి అంతే మటన్ దాల్చా రెడీ. బిర్యానీ, లేదా పులావ్ కు సైడ్ డిష్ గా దీన్ని సర్వ్ చేయండి.

English summary

Mutton Dalcha:Tasty and Healthy

Mutton Dalcha is a delicious curry in which meat is cooked with lentils and veggies .This is served as a side with any Biryani varieties.
Story first published: Wednesday, February 25, 2015, 13:31 [IST]
Desktop Bottom Promotion