For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ దాల్మా : టేస్టీ అండ్ హెల్తీ ఇండియన్ రిసిపి

|

దాల్మాను సాధారణంగా పప్పు మరియు వివిధ రకాల వెజిటేబుల్స్ తో తయారుచేస్తారు. అయితే మాంసాహార ప్రియులు మరింత టేస్టీగా దాల్మా రిసిపి మటన్ కూడా జోడించి తయారుచేసుకోవచ్చు. ఈస్ట్ సైడ్ వారికి ఈ వంట స్పెషల్ ఇండియన్ రిసిపి . ఈ మటన్ దాల్మా రిసిపి ఒరిజనల్ గా ఓరిస్సా నుండి పరిచయం చేయబడినది.

దాల్మా వెజిటెబుల్ బేసిక్ రిసిపికి మటన్ మిక్స్ చేయడం వల్ల ఇది ఒక గార్మెంట్ ఇండియన్ ఫుడ్స్ రిసిపిలా తయారవుతుంది. ఈ మటన్ కర్రీ రిసిపిని చాలా మంది ఇష్టపడుతారు. ఈ దాల్మా రిసిపి కందిపప్పు మంచి టేస్ట్ ను అందిస్తుంది. దాల్ మరియు వెజిటేబుల్ మిశ్రమానికి మటన్ చేర్చి ఉడికించడం వల్ల ఫర్ఫెక్ట్ టేస్ట్ అందిస్తుంది. మటన్ దాల్మా రిసిపిని వైట్ రైస్ లేదా పులావ్ కు కాంబినేషన్ గా వండించవచ్చు.

Mutton Dalma: A Taste Of Eastern India: Telugu Vantalua


కావల్సిన పదార్థాలు:
మటన్: 300 grams (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కందిపప్పు : 2 cups
టమోటో: 2 (slush)
పచ్చిబొప్పాయి: (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బంగాళదుంప: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పొట్లకాయ: (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1 (సన్నగా తరగాలి)
పచ్చిమిర్చి: 5 (పేస్ట్ చేసుకోవాలి)
ఆవాలు :1 tsp
బిర్యానీ ఆకు: 2
జీలకర్ర: 1 tsp
ఎండుమిర్చి: 4
కారం: 1tsp
పసుపు: 1 tsp
మస్టర్డ్ ఆయిల్: 2tbsp
ఉప్పు : రుచికి సరిపడా

READ MORE: టేస్టీ అండ్ హెల్తీ మిక్స్డ్ వెజిటేబుల్ దాల్మా రిసిపి

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టమోటో జ్యూస్, ఉప్పు మరియు పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులోనే మటన్ ముక్కలు కూడా వేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

2. అరగంట తర్వాత ఒక డీప్ పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, బిర్యానీ ఆకు, ఎండు మిర్చి, జీలకర్ర వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.

3. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలను వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

4. తర్వాత పాన్ లో వెజిటేబుల్ ముక్కలు కూడా వేసి మరో 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు మరియు మసాలా పౌడర్ వేసి మొత్తం మిశ్రమం కలగలిసేలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.

5. ఇప్పుడు మొత్తం వెజిటేబుల్ కర్రీని ప్రెజర్ కుక్కర్లో వేసి, శుభ్రంగా కడిగి పెట్టుకొన్న పప్పును కూడా 2 కప్పులు ప్రెజర్ కుక్కర్లో వేయాలి.

6. ఇప్పుడు అందులోనే 4కప్పుల నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని, 4విజిల్స్ వచ్చే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

7. అంతే మటన్ దాల్మా రెడీ. దీన్ని ప్లెయిన్ రైస్ లేదా పులావ్ తో సర్వ్ చేయవచ్చు.

English summary

Mutton Dalma: A Taste Of Eastern India: Telugu Vantalu

Mutton Dalma: A Taste Of Eastern India: Telugu Vantalu, Dalma cooked with meat not something you can get anywhere in India. It is special Indian food recipe from the east. To be precise, this mutton recipe is from the state of Orissa.
Desktop Bottom Promotion