For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ డ్రమ్ స్టిక్స్ దాల్చా: రంజాన్ స్పెషల్

|

మటన్ దాల్చ ఒక ఫేమస్ హైద్రబాద్ మటన్ కర్రీ . మాంసాహార ప్రియులకు ఈ మంటన్ కర్రీ అంటే చాలా ఇష్టమే. ఈ మటన్ డ్రమ్ స్టిక్స్ దాల్చా చాలా రుచికరంగా ఉంటుంది. అంతే కాదు, ఇందులో డ్రమ్ స్టిక్స్ (మునగకాయ)మరియు కందిపప్పు వేయడం వల్ల చాలా హెల్తీ కూడా .

ఈ మటన్ దాల్చాన రంజాన్ నెలలో విరివిగా తయారుచేసుకుంటారు . మటన్-మునకాయల కాంబినేషన్ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ . ఇందులో వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగించడంలో మంచి సువాసనతో పాటు, రుచిగా నోరూరిస్తుంటుంది. మీ మీ టేస్ట్ బడ్స్ కొరకు ఒక రాయల్ ట్రీట్ ఇవ్వాలనుకుంటే, మటన్ డ్రమ్ స్ట్రిక్స్ దాల్చాను తయారుచేసేయండి...

Mutton Drumstick Dalcha : Ramzan Special

కావల్సిన పదార్థాలు:

మసూర్ దాల్(ఎర్రకందిపప్పు): 100grms
శెనగపప్పు: 50grms
ఆవాలు: 1tsp
లవంగాలు: 4
దాల్చిన చెక్క:2
వెల్లుల్లిపాయ: 1
మాంసం: 1Kg
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఎండు మిర్చి : 10
మునగకాయలు: 2
పుదీనా తురుము: 2tsp
మామిడికాయపొడి: 2tsp
కారం: 1tsp
పసుపు: 1tsp
నెయ్యి: 50grms
మటన్ స్టాక్: 1ltr
ఉప్పు: రురియి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా మటన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి, తర్వాత కుక్కర్ లో వేసి నీళ్ళు పోసి మీడియంగా ఉడికే వరకూ 2విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ నీళ్ళనే మటన్ స్టాక్ గా వాడాలి.
3. అంతలోపు ఎర్రకందిపప్పు కడిగి ఒక గంటసేపు నానబెట్టుకోవాలి.
4. తర్వాత పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కాగాక అందులో అల్లంవెల్లుల్లి, మటన్ ముక్కలు, నానబెట్టిన పప్పులు, మునగకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
5. పచ్చివాసన పోయే వరకూ వేగిన తర్వాత అందులో మటన్ స్టాక్ పోసి మటన్ ముక్కలు పూర్తిగా ఉడికే వరకూ ఉంచాలి.
6. మరో పాన్ లో నూనె వేసి, జీలకర్ర, శాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
7. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగాక ఉడికించిన మటన్ మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపి దింపుకోవాలి.
8. చివరగా మామిడికయ పొడి, మిగిలిన నెయ్యి, పుదీనా తురుము వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే మటన్ డ్రమ్ స్టిక్ దాల్చా రెడీ.

English summary

Mutton Drumstick Dalcha : Ramzan Special

Mutton Dalcha is a very famous mutton curry from Hyderabad with appetizing flavors and aroma that is very often accompanied with either biryani or brinji. Mutton is cooked along with toor dal and flavored with spices, ginger and garlic, it is a royal treat to the taste-buds and makes good sides with rice.
Desktop Bottom Promotion