For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ కైమా బేసన్ రోటీస్

|

Mutton Keema Rotis
కావలసిన పదార్దాలు:
మటన్ కైమా: 1/2 kg
సెనగపిండి: 1/2kg
నీళ్లు: తగినన్ని
ఆయిల్: తగినంత
వెన్న: 100 grm
ఉల్లిముద్ద: 1 cup
కొత్తిమీర తురుము: 1 cup
పచ్చికొబ్బరి పేస్ట్: 1 cup
కోడిగుడ్లు: 2
అల్లం వెల్లుల్లి ముద్ద: 2 tbsp
కారం: 2 tsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
గరం మసాలా పొడి: 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానాము:
1. కైమాను శుభ్రంగా కడిగి, అందులో ఒక స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద కలిపి కొద్దిగా నీళ్లు చల్లి 15 నిమిషాల పాటు కుక్కర్‌లో ఉడికించాలి.
2. గుడ్డులోని తెల్లసొనను బాగా గిలకొట్టాలి. కైమాలో సెనగపిండి, గిలకొట్టిన తెల్లసొన, వెన్న, ఉల్లిముద్ద, కొబ్బరి ముద్ద, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి పేస్టు, మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, మసాలా పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి గట్టి ముద్దలా కలిపి ఓ గంటసేపు నానబెట్టాలి.
3. తరవాత ఈ కైమా మిశ్రమాన్ని పెద్ద సైజు లడ్డూల మాదిరిగా చేసి పాలకవర్లమీద రొట్టెలుగా చేసి పెనంమీద కొద్దికొద్దిగా నూనె వేస్తూ రెండువైపులా దోరగా కాల్చాలి.
వీటిని వేడివేడిగా టొమాటో కెచప్‌, గ్రీన్‌ చిల్లీ సాస్‌లతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.

Story first published:Saturday, March 27, 2010, 13:51 [IST]
Desktop Bottom Promotion