For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాన్స్ -క్యాప్సికమ్ కర్రీ -వింటర్ స్పెషల్

|

మన ఇండియాలోని కేరళ రాష్ట్రంలోని కొంకన్ లో సీఫుడ్స్ అంటే చాలా పాలపుర్ . అక్కడ చాలా డిఫరెంట్ సీఫుడ్స్ వివిధ రకాల రుచులతో తయారుచేసినవి మనకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఫిష్, మరియు ప్రాన్స్ తో తయారు చేసే వంటలు ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంటాయి. అటువంటి వంటకాల్లో ఒక స్పెషల్ వంట ప్రాన్ రిసిపి.

వంటకాల్లో రొయ్య రాజసమే వేరు. టేస్టులో ‘నేనే ద బెస్ట్' అంటూ మీసం తిప్పి మరీ చెప్పేందుకే రొయ్యకు మీసాలుంటాయి. ప్లేట్‌లో నెలవంకలా మెలితిరిగి ఉండేదే రొయ్య. రొయ్యను తినాలంటే మీసాలు తిరగక్కర్లేదు. గిన్నెలో గరిటా, వండేవారి చెయ్యీ తిరిగితే చాలు. అలా చెయ్యితిరిగేలా చెయ్యడానికే మీకోసం డిషెస్. ప్రాణం లేచివచ్చేలా ప్రాన్స్‌ను ఆస్వాదిద్దాం... రండి... జాయినవ్వండి.

Prawn Capsicum Curry For Winter Special

కావల్సిన పదార్థాలు:
ప్రాన్స్(రొయ్యలు)- 500grms(షెల్ తొలగించి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 8(సన్నగా తరిగినవి)
కాప్సికమ్ లేదా బెల్ పెప్పర్: 1(చిన్న ముక్కలుగా తరిగినవి)
టమోటో: 1 (సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
చింతపండు గుజ్జు: 1tbsp
పచ్చిమామిడికాయ తురుము: 1tbsp
కారం : 1/2 tsp
పసుపు పొడి: 1/2 tsp
ధనియాల పొడి: 1tsp
ఉల్లిపాయ విత్తనాలు పొడి లేదా కలౌంజీ: 1/2 tsp
పచ్చిమిర్చి: 2 (మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి)
నూనె: 2tbsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసి మ్యారినేట్ చేసి 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు కట్ చేసుకోవల్సిన పదార్థాలన్నింటిని తరిగి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత డీప్ బాటమ్ పాన్ తీసుకొని, వేడయ్యాక అందులో ప్రాన్స్ వేసి, లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే పాన్ లో ఉన్న ఆయిల్ తోటే ఉల్లిపాయ విత్తనాలు లేదా కలౌంజీ మరియు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి మరో 5నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. వెంటనే వెల్లుల్లి కూడా వేసి మరో 2 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే క్యాప్సికమ్ కూడా వేసి మరో మూడు నాలుగు నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత టమోటో ముక్కలు, పసుపు, కారం, ధనియాలపొడి, మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేస్తూ మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి. టమోటో మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
8. తర్వాత అందులో చింత పండు గుజ్జు మరియు మామిడి తురుము వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
9. ఇప్పుడు అందులో రెండు కప్పుల నీరు పోసి, కర్రీని బాగా ఉడికించుకోవాలి.
10. కర్రీ ఉడుకి, గ్రేవీ చిక్కబడే సమయంలో ముందుగా వేగించి పెట్టుకొన్న ప్రాన్స్ (రొయ్యల)ను అందులో వేసి మొత్తం మరోసారి మిక్స్ చేసి, తక్కువ మంట మీద 5 నుండి 10నిముషాలు ఉడికించుకోవాలి. అంతే అద్భుతమైన ప్రాన్-క్యాప్సికమ్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Prawn Capsicum Curry For Winter Special

In the Indian cuisine there are several kinds of prawn curry recipes. But since the mercury is up and the sweltering heat is becoming unbearable, we need some Indian curries that are suitable for summer. That is why, prawn capsicum curry is an ideal choice. This prawn curry recipe is not too spicy by Indian standards. We are used to eating raw green chillies and dry red chilli powder. And prawn capsicum curry makes use of bell peppers only.
Story first published: Tuesday, December 2, 2014, 13:12 [IST]
Desktop Bottom Promotion