For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాన్ మలై కర్రీ రిసిపి: స్వీట్ అండ్ టేస్టీ సైడ్ డిష్

|

బెంగాలీయులు ఎక్కువగా చేపలను ఇష్టపడుతారన్న విషయం తెలిసిందే. అయితే వీటితో పాటు స్పెషల్ వంటలుగా సాఫ్ట్ గా టేస్టీగా ఉండే ప్రాన్ వంటలను కూడా ఇష్టపడుతారు. సహజంగా ప్రాన్స్ ను వీరు ‘ చింగ్రీ'అని పిలుస్తుంటారు. బెంగాలీ ప్రాన్ రిసిపి చాలా టేస్ట్ గా ఉంటుంది. అటువంటి సీపుడ్ రిసిపిలలో ప్రాన్ మలై వంటకం ఒకటి. ఈ వంట ప్రతి బెంగాలీకి సుపరిచితం.

ఈ బెంగాలీ ప్రాన్ మలై కర్రీ స్వీటర్ సైడ్ డిష్ అని చెప్పవచ్చు. ఈ స్వీట్ టేస్ట్ కొబ్బరి పాలు మిక్స్ చేయడం వల్ల వస్తుంది. క్రీమీ గ్రేవీగా మరియు స్వీట్ అండ్ స్పైసీ టేస్ట్ తో సోల్ ఫ్లేవర్ తో నోరూరించే ఈ ప్రాన్ మలై కర్రీని మీరు కూడా టేస్ట్ చేయాలంటే, తయారుచేసే పద్దతిని తెలుసుకోవాలి. అయితే ప్రాన్స్ ను ఎప్పుడు కానీ ఎక్కువగా ఉడికించకూడదు.

Prawn Malai Curry: Spcl Bong Recipe

కావల్సిన పదార్థాలు:
ప్రాన్స్: 1kg
ఉల్లిపాయలు: 1+1(కట్ చేసి పేస్ట్ చేయాలి)
వెల్లుల్లి: 8(పేస్ట్ చేయాలి)
కలౌంజి(ఉల్లిపాయ విత్తనాలు): 1/2tsp
పచ్చిమిర్చి: 2+6(మద్యకు కట్ చేసి పస్ట్ చేయాలి)
కొబ్బరి పాలు: 1cup
మస్టర్డ్ పేస్ట్: 2tbsp
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
మస్టర్డ్ ఆయిల్: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రాన్స్ ను శుభ్రం చేసి పసుపు మరియు ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి. తర్వాత మస్టర్డ్ ఆయిల్ లో వేసి 3-4నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ విత్తనాలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి.
3. అంతలోపు ఒక ఉల్లిపాయను, మరియు వెల్లుల్లి మరియు మిగిలిన పచ్చిమిర్చిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
4. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో మస్టర్డ్ పేస్ట్, ఉప్పు, పసుపు చిలకరించి ఒక 5నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. చివరగా కొబ్బరి పాలు కూడా వేసి మిక్స్ చేసి 2నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
7. తర్వత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న ప్రాన్స్ వేసి, మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి 10నిముషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే ప్రాన్ మలై కర్రీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో తీసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Prawn Malai Curry: Spcl Bong Recipe

Everyone knows that Bengalis love their fish. But they have a special soft spot for prawns or 'chingri' as they call it. Prawns are every Bong's weakness. No wonder they have some really ingenious Bengali prawn recipes. Today, we will be making the most famous one though. Prawn malai curry is a recipe that every Bengali must know by heart.
Story first published: Tuesday, September 2, 2014, 17:51 [IST]
Desktop Bottom Promotion