For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ చిల్లీ -ప్రాన్ కర్రీ: స్పైసీ అండ్ టేస్టీ

|

మీరు రెగ్యులర్ గా తినే వంటలతో కొంచెం బోర్ గా ఫీలవుతుంటే, వంటలు తయారుచేసే పద్దతని మార్చండి. రొయ్యలతో చాలా తక్కువగా వెరైటలు వండుతారు. రొయ్యలతో వండే వంటలు టేస్టీగా ఉంటాయి. ఈ అద్భుతమైన రుచికి కొంచెం స్పైసీ మరియు మసాలా దినుసులు జోడించి తయారుచేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

Prawns In Green Chilli Curry

గ్రీన్ చిల్లీ ప్రాన్ కర్రీ చాలా టేస్ట్ గా స్పైసీ గా ఉంటుంది. కారం అంతగా ఇష్టపడని వారు, ఎండు మిర్చి పొడి, టమోటో లను జోడించి తయారుచేసుకోవచ్చు. అలాగే ఈకర్రీకి పుదీనా మరియు కొత్తిమీర పేస్ట్ జోడించడంలో అదనంగా ఆరోమా వాసన కలిగి నోరూరిస్తుంటుంది. మరి ఈ గ్రీన్ చిల్లీ ప్రాన్ కర్రీని మీరు టేస్ట్ చూడాలంటే తయారుచేసే పద్దతిని ఫాలో అవ్వాల్సిందే...
కావల్సిన పదార్థాలు:
మీడియం సైస్ రొయ్యలు: 20 (750 గ్రాముల)
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
కొబ్బరి : 1 cup(తురుముకోవాలి)
అల్లం: 1 అంగుళం (పేస్ట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 10 (పేస్ట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ విత్తనాలు లేదా Kalounji: 1/2tsp
పచ్చిమిర్చి -10
మింట్ (పుదీనా)ఆకులు - కొద్దిగా
కొత్తిమీర: 2 కొమ్మలు
డ్రై మామిడి పొడి లేదా amchur: 1tsp
గరం మసాలా: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి అందులో శుభ్రం చేసుకొన్న రొయ్యలను వేసి 3,4నిముషాలు లైట్ గా వేయించుకోవాలి.
2. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో మరికొంత నూనె వేసి, వేడయ్యాక అందులో అల్లం మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిముషం వేయించిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి. తర్వాత అందులోనే కొబ్బరితురుము కూడా వేసి 4నిముషాలు వేయించుకోవాలి, ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
4. అంతలోపు పచ్చిమిర్చి, అల్లం, మరియు కొత్తిమీర కూడా మరో జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. ఇప్పుడు అదే పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ విత్తాలు వేసి వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసి రెండు, మూడు నిముషాలు వేయించుకోవాలి.
6. ఇప్పుడు అందులో ఉల్లిపాయ, కొబ్బిర పేస్ట్ వేసి అలాగే పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
7. తర్వాత డ్రై మ్యాంగో పౌడర్, గరం మసాలా మరియు జీలకర్ర పొడి, ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి ఉడికించుకొని, ముందుగా వేయించుకొన్న ప్రాన్స్(రొయ్యలను)అందులో వేసి, మూత పెట్టి 5-10నిముషాలు ఉడికించుకోవాలి . అంతే గ్రీన్ చిల్లీ ప్రాన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంతో చాలా రుచికరంగా ఉంటుంది.

English summary

Prawns In Green Chilli Curry

Are you bored of having the same old prawn curries? Most Indian prawn recipes turn out to be red or yellow curries. If you use tomatoes and red chillies you have a red prawn curry; if you use coconut and turmeric you get a yellow one.
Story first published: Friday, February 14, 2014, 18:04 [IST]
Desktop Bottom Promotion