For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ స్పెషల్ : బటర్ ఖీమా మసాల

|

బటర్ ఖీమా మసాల ఒక న్యూట్రీషియన్ రిసిపి. ఈ రిసిపికి ముఖ్యంగా కావల్సిన పదార్థాలు, పెరుగు, మరియు మటన్. వీటితోనే
ఈ వంటకు స్పెషల్ టేస్ట్ వస్తుంది. పెరుగులో క్యాల్షియం మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది కంప్లీట్ డైట్ ప్రోటీన్ ఫుడ్ , అదే విధంగా ఇది ఒక టేస్టీ ఫుడ్.

మీకు మటన్ రిసిపి ఇష్టమైతే ఈ వంటను తప్పనిసరిగా ట్రై చేయాలి. ఖీమా బటర్ మసాల ఒక టేస్టీ డిష్ సాధారణ ఖీమా కర్రీ కంటే కొంచెం డిఫరెంట్ గా తయారుచేస్తారు . ఈ వంటను ఇంట్లోనే చాలా డిఫరెంట్ గా వెరైటీగా తయారుచేసుకోవచ్చు . ఈ ఖీమా మసాలా క్రీమ్ మరియు బటర్ సోర్ టేస్ ను అందిస్తుంది . పెరుగు ఎక్కువ కారం లేకుండా తగ్గించి, ఒక డిఫరెంట్ టేస్ట్ ను అందిస్తుంది. మరియు ఈ రుచికరమైన బటర్ ఖీమా రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Ramazan Special: Butter Keema Masala

కావల్సిన పదార్థాలు:
బీఫ్ లేదా మటన్: 1kg
పెరుగు: 1cup
బటర్: 1cup
అల్లం పేస్ట్: 3tsp
వెల్లుల్లి పేస్ట్ : 3tsp
ఉల్లిపాయలు: 3పీసెస్

READ MORE: బట్టర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ : టేస్టీ సైడ్ డిష్
లవంగాలు: 5-7
దాల్చిన చెక్క: 1
బ్లాక్ యాలకలు: 2
గ్రీన్ యాలకలు: 2
పచ్చిమిర్చి: 8
బిర్యానీ ఆకు: 1
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 3tsp
కొత్తిమీర తరుగు: కొద్దిగా

READ MORE: బట్టర్ (వెన్న)గార్లిక్ ఫిష్ ఫ్రై రిసిపి

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఖీమా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో సన్నగా తరిగిపెట్టుకొన్ని టమోటో ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.

READ MORE: చికెన్ బటర్ మసాలా తక్కువ కారం -ఎక్కువ రుచి

5. ఈ కీమా మిశ్రమానికి బటర్ జోడించి బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు ఈ ఖీమా మిశ్రమానికి ముందుగా తయారుచేసుకొన్న మసాలా మిశ్రమం మిక్స్ చేయాలి.
7. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి, తర్వాత అందులో ఉప్పు, కారం డ్రై అయ్యే వరకూ ఫ్రై చేసుకోవాలి.
8. తర్వాత అందులో పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. మంట తగ్గించి, పెరుగు వేసి ఖీమా మొత్తం అబ్జార్బ్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మరియు ఎండు మిర్చి మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బటర్ ఖీమా మసాలా రెడీ. దీన్ని నాన్ మరియు చపాతీతో సర్వ్ చేయాలి.

English summary

Ramazan Special: Butter Keema Masala: Telugu Vantalu

Butter keema masala recipe is one of the most nutritious recipes as its main ingredients are butter, yoghurt and mutton. Yogurt is rich in calcium and other nutrients, while meat contains all the essential proteins. It is a complete diet and tasty as well.
Story first published: Saturday, July 4, 2015, 12:40 [IST]
Desktop Bottom Promotion