For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ స్పెషల్ : రుచికరమైన మటన్ డ్రై ఫాల్ రిసిపి

|

రంజాన్ మాసంలో ముస్లీంలు వివిధ రకాల మాంసాహార వంటలను తయారుచేసుకుంటారు. అయితే రెగ్యులర్ గా తయారుచేసుకొనే వంటలు కాకుండా, కొంచెం డిఫరెంట్ గా తయారుచేసే వంటలు చాలా అద్భుతంగా రుచికరంగా నోరూరిస్తుంటాయి.

ప్రస్తుతం రంజాన్ సీజన్. ఈ నెలలో మేము మీకోసం వివిధ రకాల మాంసాహార వంటలను పరిచయం చేస్తున్నాము. ఇవి చాలా డిఫరెంట్ రుచిని కలిగి ఉంటాయి. వివిధ మాంసాహార వంటల్లో డ్రై ఫాల్ రిసిపి రిసిపి కూడా ఒకటి . ఇది ఒక రాయల్ కిచెన్ రిసిపి, ఇది నిజామ్ ల కాలం నాటి అద్భుతమైన రుచికరమైన వంట. డ్రై ఫాల్ రిసిపి ప్రతి ఒక్కరూ ఇంట్లో చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

ఈ రంజాన్ సీజన్ లో దాదాపు అందరు ముస్లీముల ఇల్లలోనూ మటన్ కుర్మాను వండుతారు.డ్రై ఫాల్ రిసిపి చాలా డిఫరెంట్ కలర్ మరియు ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ఈ మటన్ డ్రై ఫాల్ రిసిపి వైట్ అండ్ ఎల్లో కలర్లో నోరూరిస్తూ ఉంటుంది. ఇలా తయారవడానికి ఇందులో వేసే మసాలా పేస్ట్ ల వల్ల ఈ స్ట్రక్చర్ ను కలిగి ఉంటుంది. మరి ఈ ఇప్తార్ మీల్ కు మీరు కూడా ఒక అద్భుతమైన రుచిగల రాయల్ వర్షన్ వంటను రుచి చూడాలంటే మటన్ డ్రై ఫాల్ రిసిపి తయారుచేయు విధానం తెలుసుకోవాల్సిందే.

Ramzan Special: Authentic Dry Phall Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్ బ్రెస్ట్ లేదా మటన్ - 1kg
బట్టర్ లేదా నెయ్యి లేదా నూనె - 300 g
చికెన్ లేదా మటన్ స్ట్రాక్(ఉడికించిన నీరు) - 1 and ½ cup
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం పేస్ట్ - 2 teaspoons
వెల్లుల్లి పేస్ట్ - 2 teaspoons
ఉల్లిపాయ పేస్ట్ - 2 teaspoons
పసుపు - 1 teaspoon
గరం మసాలా పౌడర్ - 1 teaspoon
డ్రై రెడ్ చెల్లీస్ - 4
జీలకర్రపొడి - 1 teaspoon
పెరుగు - 100 mL
టమోటోలు - 2 (సన్నగా తరిగినవి)
నిమ్మరసం- ½ of a lemon
బ్లాక్ పెప్పర్ - 2 teaspoons
ఉప్పు - రుచికి సరిపడా
పంచదార - 1 teaspoon
కొత్తిమర తరుగు - for garnishing

మ్యారినేషన్ కోసం:
మొదట బౌల్ తీసుకుని మటన్ శుభ్రం చేసి పెట్టుకోవాలి.
తర్వాత అందులోనే నిమ్మరసం, పెరుగు, అల్లం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
మొత్తం మిశ్రమం కలినిపిన తర్వాత కనీసం 2 గంటలన్నా మ్యారినేట్ అవ్వాలి.

తయారుచేయు విధానం:
1. పాన్ లో బట్టర్ లేదా నెయ్యి లేదా నూనె వేసి కాగనివ్వాలి.
2. తర్వాత నూనె వేడయ్యాక అందులో జీలకర్ర మరియు డ్రై రెడ్ చిల్లీ వేసి లైట్ గా వేగించుకోవాలి.
3. తర్వాత జీలకర్ర మరియు ఎండుమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో మరికొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి.
5. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, ఉల్లి, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించుకోవాలి.
6. మసాలా పచ్చివాసన పోయి, నూనె తేలే వరకూ వేగించుకోవాలి.
7. తర్వాత అందులో జీలకర్ర మరియు పసుపు వేసి వేగించుకోవాలి.
8. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని మాంసం వేసి బాగా ఫ్రై చేయాలి.
9. అలాగే టమోటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, బ్లాక్ పెప్పర్ మరియు పంచదార వేసి ఫ్రై చేయాలి.
10. తర్వాత చికెన్ లేదా మటన్ స్టాక్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
11. ఇప్పుడు మంటను మీడియంగా పెట్టి మొత్తం కర్రీని చిక్కగా ఉడికించుకోవాలి . చికెన్ అయితే చాలా తర్వాగా ఉడుకుతుంది, మటన్ ఉడకడానికి కొద్దిగా సమయం పడుతుంది . మటన్ ఉడికేటప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి.
12. మటన్ మెత్తగా ఉడికిన తర్వాత , కొద్దిగా గరం మసాల చిలకరించి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి .
13. చివరగా కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర ఆకులను సన్నగా తరిగి గార్నిష్ చేయాలి. అంతే రుచికరమైన మటన్ లేదా చికెన్ డ్రై పాల్ రిసిపి రెడీ..

English summary

Ramzan Special: Authentic Dry Phall Recipe

Ramzan Special: Authentic Dry Phall Recipe,The holy Ramzan period has started and all the pious Muslims have started their fast, which will go throughout the month and finally, they will celebrate the Eid with great pomp and vigour.
Story first published: Thursday, June 23, 2016, 13:11 [IST]
Desktop Bottom Promotion