For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ సేమియా బిర్యాని...!

|

Semiya Biryani.
బిర్యాని లవర్స్ కు ఇది ఒక కొత్త రుచి. సేమియా బిర్యాని కూడా ఓ ట్రెడిషినల్ వంటలా మారబోతోంది. ఎందుకంటే మన సాంప్రదాయ వంటకాల్లో సేమియాతో పాయసం.., ఉప్మా, సేమియా ఇడ్లీ ఇలా చాలా వెరైటీ రుచులకు తయారు చేసుకొంటాం కాబట్టి. అయితే ఎవరైతే సేమియా ఉప్మా, ఇడ్లీ వంటివి ఇష్టపడరో వారు ఇలా హాట్ మరియు స్పైసీ సేమియా బిర్యాని ప్రయత్నించి కొత్తి రుచిని ఆశ్వాదించవచ్చు. ఇది రైస్ ఇష్టపడని వారు కూడా ప్రయత్నించవచ్చు.
కావలసిన పదార్థాలు:
సేమియా: 2cups
చికెన్ ముక్కలు: 1cup(చికెన్ సేమియా బిర్యాని) లేదా వెజిటేబుల్స్ : 1cup(వెజిటేబుల్ సేమియా బిర్యాని)
ఉల్లిపాయ: 1(ముక్కలుగా కట్ చేసుకొన్నవి)
టమోటో: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
పచ్చిమర్చి: 2
బిర్యాని మసాలా: 2tbsp
పసుపు: 1/2tsp
జీలకర్ర పొడి: 1tsp
కారం: 1tsp(మీ రుచికి తగినంత)
పుదీనా: 1/2cup
కొత్తిమీర: 1/2cup
గరం మసాలా: (బిర్యాని ఆకు:1, చెక్క: 2చిన్న ముక్కలు, లవంగాలు: 3, యాలకులు: 3)
పెరుగు: 1cup
నెయ్యి: 1tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత

వెజిటేబుల్ బిర్యానికి వెజిటేబుల్స్(క్యారెట్, బంగాళాదుంప, బీన్స్, పచ్చిబఠానీ, క్యాప్సికమ్, కాలిఫ్లవర్, etc)

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ శుభ్రం చేసి ఒక గిన్నెతీసుకొని అందులో పెరుగు, గరం మసాలా పొడి, ఉప్పు, కారం, మరియు పసుసు వేసి బాగా కలిపి చికెన్ కు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. చిన్న పాత్ర తీసుకొని అందులో రెండు కప్పుల సేమియాకు రెండు కప్పుల నీళ్ళు పోసి కాగా కాగనివ్వాలి. నీళ్ళ మరిగేటప్పుడు కొద్దిగా ఉప్పు, నూనె, వేసి తర్వాత సేమియాను కూడా వేసి బాగా కలపాలి.
3. సేమియా బాగ పొడిపొడిగా అయ్యేంత వరకూ మీడియం మంట మీద ఉడకనివ్వాలి. (75%ఉడికిన తర్వాత నీళ్ళు ఏమైనా ఉంటే వంచేసి పక్కన పెట్టుకోవాలి)
4. అంతలోపు మరో పాన్ తీసుకొని అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో గరం మసాలాకు సిద్దం చేసుకొన్నవి వేసి వేయించాలి.
5. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ బాగా వేయించుకోవాలి.
6. ఇప్పుడు కట్ చేసిపెట్టుకొన్న టమోటో ముక్కలు వేసి వేయించి మొత్తగా ఉడకనివ్వాలి.
7. తర్వాత పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.
8. ఇప్పుడు ముందుగా మసాలా అంటించి పెట్టుకొన్ని చికెన్ అందులో వేసి బాగా వేయించాలి. చికెన్, మసాలా మిశ్రమం బాగా కలిసి ఉడికేలా చూసుకోవాలి.
9. చికెన్ ఉడికిందని మీరు నిర్ధారించుకొన్నప్పుడు అందులో తగినంత ఉప్పు, ఉడికించి పెట్టుకొన్న సేమియా వేసి మరో రెండు నిమిషాల పాటు మసాలా సేమియాకు పట్టే విధంగా మగ్గనివ్వాలి.
10. ఇప్పుడు పాన్ కు సరిగా సరిపోయే మూత పెట్టి, మంట తగ్గించి ఆవిరి మీదే మరో పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. (లేదా ఓవెన్ లో కూడా పెట్టుకోవచ్చు)
11. పది నిమిషాల తర్వాత కొత్తిమీర తరగు, జీడిపప్పుతో గార్నిష్ చేసి ఏదేని రైతాతో హాట్ హాట్ గా సర్వ్ చేయాలి అంతే చికెన్ సేమియా బిర్యాని రెడీ.
వెజిటేబుల్ బిర్యాని కూడా ఇదే పద్దతిలో తయారు చేసుకోవచ్చు. అయితే చికెన్ ప్లేస్ లో మీకు నచ్చిన వెజిటేబుల్ వేసుకవాలి అంతే)

English summary

Semiya Biryani...! | సేమియా బిర్యాని...!

For all the biriyani lovers, semiya biriyani is a new twist to the traditional biriyani. Traditionally semiya (vermicelli pasta) was used just to make payasam and upma. But those who are not big fans of upma and payasam and those who really love spice food, here is a great alternative with semiya. It is also a good option for those who are trying to avoid rice. You could use the same recipe and make pasta biriyani. For a healthier twist you could try with whole wheat pastas.
Story first published:Tuesday, July 3, 2012, 10:02 [IST]
Desktop Bottom Promotion