For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ చిల్లీ గీ రోస్ట్ రిసిపి : నాన్ వెజ్ స్పెషల్

By Super Admin
|

'చిల్లీ చికెన్' మరియు 'చిల్లీ రోస్ట్' ఈ పేర్లు వింటేనే రెండు అద్భుతమైన రుచిగల టేస్టీ వంటలు. ఈ రెండు వంటలు మంగళూరియన్స్ స్ఫెషల్ వంటలు, 'దీన్నే చిల్లీ చికెన్ గీ రోస్ట్ ' అని కూడా పిలుస్తారు.

పేరు వింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి?ఇక వంట పూర్తైతే సాఫ్ట్ గా జ్యూసీగా , క్రీమీ సాస్ తో తినడం ఊహించుకుంటే ,ఆహా...ఆ అనుభూతి ఎలా ఉంటుంది . ఈ చిల్లీ చికెన్ గీ రోస్ట్ ను పుదీనా, కొత్తిమీర చట్నీ లేదా టమోటో రసంతో వడ్డిస్తే, అద్భుతంగా ఉంటుంది.

ఈద్, నవరాత్రి, దివాళి వంటి పండగలు, నాన్ వెజ్ లేకుండా పూర్తికాదు, మీరు రెగ్యులర్ గా చికెన్ ఇష్టపడే వారైతే, ఇటుంటి చికెన్ రిసిపిలను తయారుచేసుకోవచ్చు. చాలా సింపుల్ గా, త్వరగా తయారవుతుంది. అథితులు కూడా హ్యాపీగా ఫీలవుతారు.

Special Chilli Chicken Ghee Roast

ఎంత మందికి సరిపోతుంది - 6

కావాల్సినవి సమకూర్చుకోవడానికి పట్టే సమయం - 20నిముషాలు

వండటానికి పట్టే సమయం - 20 నిముషాలు

కావల్సిన పదార్థాలు:

1. చికెన్ - 600గ్రాములు (బోన్ లెస్ మరియు చిన్న ముక్కలుగా కట్ చేసినవి)

2. పెరుగు - 4టేబుల్ స్పూన్లు

3. నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు

4. అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2టేబుల్ స్పూన్లు

5.పసుపు - చిటికెడు

6. బెల్లం లేదా పంచదార - 1 టేబుల్ స్పూన్లు

7. ఉల్లిపాయ - 1 (సన్నగా కట్ చేసుకోవాలి)

8. రుచికి సరిపడా ఉప్పు

9. కరివేపాకురెమ్మలు - 5

10. ఎండు మిర్చి - 10

11. జీలక్ర - ½ టీస్పూన్

12. మెంతులు - ¼th టీస్పూన్

13. ధనియాలు - 1 టేబుల్ స్పూన్లు

14. పచ్చికొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు (రోస్ట్ చేసుకోవాలి)

15.సోంపు - ½ టీస్పూన్

16.లవంగాలు - 2

17. దాల్చిన చెక్క - 2

18.నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్లు

19. చింతపండు గుజ్జు- ½ టీస్పూన్

తయారీ విధానం:

1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి తక్కువ మంట మీద అన్ని రకాల మసాలాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఎండు మిర్చి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2. వేయించుకున్న పదార్థాలు చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

3. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి, అందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలాలు, పెరుగు, వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్ సమయంలోనే పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక గంట పక్కన పెట్టుకోవాలి.

4. తర్వాత మరో పాన్ స్టౌమీద పెట్టి, నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ కలర్లోకి మారే వరకూ వేగించుకోవాలి.

5. ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసిన చికెన్, వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే 1/4కప్పు నీళ్ళు జోడించి, చిక్కగా ఉడికించాలి. మరీ గ్రేవీలా కాకుండా చిక్కగా ఉండేట్లు చూసుకోవాలి.

6. ఇప్పుడు, కొబ్బరి తురుము, చింతపండు పేస్ట్, బెల్లం, నెయ్యి కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అవసరమైతే అందులోనే కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఉడికించుకోవచ్చు.

7.మొత్తం మిశ్రమాన్ని 10 నిముసాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

8. అంతే చికెన్ చిల్లీ గీ రోస్ట్ రిసిపి రెడీ .వేడి వేడిగా వడ్డించడమే ఆలస్యం ఇష్టంగా తినేస్తారు.

English summary

Special Chilli Chicken Ghee Roast

'Chilly Chicken' and 'Chicken Roast'- when these two yummy dishes are amalgamated, a Mangalorian delicacy called the 'Chilli Chicken Ghee Roast' recipe can be created. The name of the dish sounds so mouth-watering doesn't it? Imagine when you get the soft and juicy chicken cooked in a delicious creamy sauce, how great the feeling would be! You can serve it hot with mint and coriander chutney or tomato rasam.
Story first published: Wednesday, November 2, 2016, 11:08 [IST]
Desktop Bottom Promotion