For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ యమ్మీ స్పైసీ మసాలా ఎగ్ ఫ్రై రిసిపి

|

సాధారణంగా గుడ్లతో వివిధ రకాల వంటలను తయారుచేయవచ్చు. ముఖ్యంగా గుడ్డుతో తయారుచేసే వంటలను రోజులో ఎప్పుడైనా బ్రేక్ ఫాస్ట్, మీల్ , డిన్నర్ ఇలా ఎప్పుడైనా తినవచ్చు . గుడ్డును పగులగొట్టి, ఎగ్ బుర్జు, ఎగ్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్ తయారుచేసుకుంటాము. అలాగే ఉడికించిన గుడ్డుతో వివిధ రకాల వంటలను కూడా తయారుచేస్తారు.

అందుకే వంటల్లో గుడ్డుతో తయారుచేసే వంటలు ఒక సూపర్ డిష్ గా ఉంటుంది. ఉడికించిన గుడ్లును ఫ్రై చేసి, వివిధ రకాల మాసాలా దినుసుల పేస్ట్ తో చిక్కటి గ్రేవి తయారుచేసి అందులో గుడ్లను జోడించి తయారుచేసి ఈ ఎగ్ మసాల ఫ్రై చాలా టేస్ట్ గా నోరూరిస్తుంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Special Masala Egg Fry Recipe

కావల్సిన దార్థాలు:

  • ఉడికించిన గుడ్లు - 4 (chopped)
  • ఉల్లిపాయలు - 1 cup (finely chopped)
  • టమోటోలు - 1 cup (finely chopped)
  • స్ప్రింగ్ ఆనియన్స్ - 1 cup
  • పచ్చిమిర్చి - 5 to 6
  • కారం - 1/2 teaspoon
  • జీలకర్ర - 1/2 teaspoon
  • ధనియాల పొడి - 1/2 teaspoon
  • వెల్లుల్లి రెబ్బలు - 4 to 5 cloves
  • ఉప్పు: రుచికి సరిపడా
  • నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అందులో టమోటో, వెల్లుల్లి మరియు కొద్దిగా నీరు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత, టమోటో మరియు వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి .
5. తర్వాత అందులో పసుపు, కారం మరియు ధనియాల పొడి మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి.
6. మొత్తం మిశ్రమం వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి, కట్ చేసి పెట్టుకొన్న గుడ్డును వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమం వేగించుకోవాలి.
7. చివరగా కొత్తిమీర తరుగును చిలకరించి, వేడి వేడిగా చపాతీ , మరియు వైట్ ప్లెయిన్ రైస్ తో సర్వ్ చేయాలి.

English summary

Special Masala Egg Fry Recipe

what's the special recipe then? Well, it's the egg masala fry. Yup, egg masala fry is a simple recipe that tastes just awesome. The best part of the egg recipe is that you can serve it as a starter or as a side dish. Also, if you have plans to party this weekend at your house, you can serve the egg masala fry with other drinks, as it tastes really great!
Story first published:Tuesday, May 17, 2016, 12:41 [IST]
Desktop Bottom Promotion