For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ చికెన్ మసాలా బర్త -వీకెండ్ స్పెషల్

|

చికెన్ బర్త ఒక పాపులర్ డిష్ . దీన్ని రోటీలు మరియు రైస్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నాన్ వెజిటేరియన్ రిసిపిని చికెన్ మరియు ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తారు . ఇది చూడటానికి నార్మల్ బర్త్ లా గా ఉంటుంది . అయితే కొంచెం స్పైసీగా ఉంటుంది.

చికెన్ బర్త్ ను మ్యాస్ చేసి ఫ్రైచేస్తారు . మరి మీరు కూడా దీన్ని టేస్ట్ చేయాలంటే, ఈ వీకెండ్ స్పెషల్ ట్రై చేయండి.

Spicy Chicken Bharta-Weekend Special
కావల్సిన పదార్ధాలు:
చికెన్: 1kg(బోన్ లెస్ మరియు స్కిన్ లెస్ మీడియం సైజ్ ముక్కలు)
ఉల్లిపాయలు: 4(సన్నగా కట్ చేసుకోవాలి)
టమటో : 2(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4 -5(సన్నగా కట్ చేసుకోవాలి)
పసుపు: 1/2tsp
కారం: 1tsp
గరం మసాలా : 1tsp
మెంతి ఆకులు: 1tsp
జీలకర్ర: 1tsp
టమోటో కెచప్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp

తయారుచేయు విధానం
1. ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక, అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి.
2. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి , టమోటో వేసి కొన్ని నిముషాలు వేయించుకోవాలి . టమోటో మొత్తగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
3. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మొత్తగా పేస్ట్ చేయాలి.
4. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లిపాయలు మరియు చికెన్ , పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి . తర్వాత అందులో ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తి మీడియం మంట మీద 5 నుండి 10 వరకూ వేయించుకోవాలి. గ్రేవీ చిక్కబడేంత వరకూ ఉడికించుకోవాలి .
5. మద్యమద్యల చూస్తూ చికెన్ బ్రౌన్ కలర్ లోకి మారి, చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో గరం మసాలా, కారం, మెంతి మరియు టమోటో కెచప్ వేసి బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు అందులో ముందుగా పేస్ట్ చేసుకొన్న మసాలాను వేసి బాగా మిక్స్ చేసి మరో ఐదు నిముషాలు వేయించుకోవాలి. అంతే చికెన్ బర్త రెడీ . చివరగా కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేయాలి. అంతే రోటీ మరియు రైస్ తో సర్వ్ చేయాలి.

English summary

Spicy Chicken Bharta-Weekend Special

Chicken bharta is one of the popular side dishes that is served with rotis or rice. This non-vegetarian recipe is made with chicken and Indian spices. It is like a normal bharta. The only difference is that it is extremely spicy unlike others.
Story first published: Saturday, February 8, 2014, 10:41 [IST]
Desktop Bottom Promotion