For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ గోంగూర చికెన్ డ్రై ఫ్రై: వీకెండ్ స్పెషల్

|

వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గొంగూర ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు వండొచ్చు. అలాంటి వంటల్లో గోంగూర చికెన్ డ్రై ఫ్రై ఒకటి.

గోంగూరు' ఈ రుచి తెలియని తెలుగు వారు ఉండరు.. ఆంధ్రా గోంగూర వంటకానికి పెట్టింది పేరు.. గోంగూరతో చేసే ప్రతి వంటకం ఘుమ, ఘుమలాడుతూ మంచి రుచిని కలిగి ఉంటుంది.గోంగూర పచ్చడి ఆంధ్రా స్టేట్ లో ఒక పాపులర్ సైడ్ డిష్ రిసిపి. ఒక్క ఆంధ్రాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గోంగూపచ్చడికి అత్యంత ప్రియులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇష్టపడే గోంగూర పచ్చడి సౌత్ ఇండియన్ రిసిపిల్లో ప్రధానంగా ఉంటుంది. పుల్లపుల్లగా, కారంగా ఉండే ఈ గోంగూర పచ్చడి ఆంధ్రాలో తెలుగు వారు ఎక్కువగా రైస్ తో తింటారు.

గోంగూరకు చికెన్ జోడిస్తే ఆ రుచే వేరు.. మాంసాహార ప్రియులకు ఈ వంటంకం మరింత రుచిని పంచుతుంది. ఒక్క రుచి మాత్రమే కాదు, ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గోంగూర ఆకుల్లో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది,. ఇందులో ఐరన్‌ అధికంగా ఉండడం వల్ల, కొంచెం ఎక్కువ తింటే అరక్కపోవడం కద్దు. గోంగూర చికెన్ డ్రై ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు, తయరు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం..

Spicy Gongura Chicken Dry Fry Recipe

చికెన్ : 1kg
గోంగూర ఆకులు : 100 grms
ఉల్లిపాయలు : 2 (సన్నగా తరిగినవి)
మింట్(పుదీనా ఆకులు): గుప్పెడు
ఎండుమిర్చి : 10
నీరు : 1గ్లాసు
కారం: ½ tsp
ఉప్పు : రుచికి సరిపడా
అల్లం మరియు వెల్లుల్లిపేస్ట్: 1 tsp
మసాలా పొడి : 1 tsp
పసుపు : ½ tsp
ఆయిల్ : 2 ½ tsp
కొత్తిమిర : కొద్దిగా
నీళ్ళు : కొద్దిగా చికెన్ ఉడికించుకోవడానికి

తయారుచేయు విధానం:
1. మిక్సీలో ఎండుమిర్చి, కొత్తిమీరను వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలు వేసి, చికెన్ ఉడకడానికి సరిపడా నీళ్ళు పోయాలి.
3. తర్వాత అందులోనే కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
4. చికెన్ ఉడికిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించుకోవాలి.
6.పోపు, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో గోంగూర ఆకలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మొదట పేస్ట్ చేసిపెట్టుకొన్న ఎండిమిర్చి కొత్తిమీర పేస్ట్ ను అందులో వేసి ఫ్రై చేయాలి.
7. ఈ మిశ్రమం మాడిపోకుండా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి ఫ్రై చేసుకోవాలి.
8. ఇప్పుడు ఉడికించుకొన్న చికెన్ వేయాలి. చికెన్ తో పాటు, ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి. తర్వాత మంటను మీడియంగా పెట్టి, తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే గోంగూర చికెన్ డ్రై ఫ్రై రెడీ...

English summary

Spicy Gongura Chicken Dry Fry Recipe

This afternoon we have a special treat for you to indulge in. If your in love with chicken, then this is a must try recipe. Gongura is nothing but red sorrel leaves. These leaves are often confused with spinach because of their uncanny looks.
Story first published: Saturday, March 7, 2015, 16:46 [IST]
Desktop Bottom Promotion