For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరించే స్పైసీ మటన్ మసాలా గ్రేవీ

|

మటన్ మసాల గ్రేవీ ఒక అద్భుతమైన రుచి కలిగిన నాన్ వెజ్ డిష్. దీన్ని కర్రీ, గ్రేవీ, కుర్మా, సైడ్ డిష్ గాను తయారుచేసుకుంటారు . మటన్ రిసిపిలను వివిధ రకాలు తయారుచేయాడనికి వివిధ పద్దతులను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా మన ఇండియల్ ఏ రాష్ట్రం వారికైన అత్యంత ఇష్టమైన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ మటన్ మరియు చికెన్ తో తయారుచేసిన వంటలే. సింధి స్టైల్ మటన్ కర్రీ ఫేవరెట్ మీల్ డిష్. ఈ నాన్ వెజిటేరియన్ రిసిపికి ఉల్లిపాయలు మరియు టమోటలను ఉపయోగించి తయారుచేస్తారు.

ఈ స్పైసీ పెప్పర్ మటన్ గ్రేవీ రిసిపిని బెస్ట్ ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తారు. ఈ స్పైసీ మటన్ రిసిపికి ఇంతటి ఘాటైన సువాసన, మరియు రుచి ఇందులో ఉపయోగించే బ్లాక్ పెప్పర్(నల్ల మిరియాల)వల్లే. ఈ పెప్పర్ గ్రేవీ మటన్ రిసిపిని ఎటువంటి సందర్భంలోనైనా తయారుచేసుకొని తినవచ్చు. మరి మీరు మాంసాహార ప్రియులైతే ఈ వెరైటీ స్పైసీ మటన్ గ్రేవీని ఎలా తయారుచేయాలో చూడండి...

Spicy Mutton Masala Gravy


కావల్సిన పదార్థాలు:
మటన్- 1/2 kg (chopped)
బట్టర్ - 1/2 cup
గరం మసాలా - 1 teaspoon
కొత్తిమీర - 1 teaspoon
కారం - 1 teaspoon
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 teaspoon
పెప్పర్: 1tbsp
పచ్చిమిర్చి - 5 to 6
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 1 cup
నిమ్మరసం - 1 teaspoon
నూనె: సరిపడా

తయారుచేయు విధానం: .
1. ముందుగా బౌల్ తీసుకొని అందులో గరం మసాలా, ధనియాలపొడి, కారం, మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
2. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు, ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో బట్టర్ వేయాలిన.
4. బట్టర్ కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి. ఇప్పుడు అందులోనే మటన్ కూడా వేసి ఫ్రై చేయాలి.
5. తర్వాత మసాలా వేసిమొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే ఉప్పు కూడా జోడించాలి.
7. తర్వాత నీరు సరిపడా పోయాలి. అలాగే మిగిలిన పదార్థాలు కూడా వేసి మిక్స్ చేస్తూ గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి .
8. తర్వాత అందులో నిమ్మరసం మిక్స్ చేసి మూత పెట్టి 5-6విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి .
9. తర్వాత స్టౌ ఆఫ్ చేసి కుక్కర్ కూల్ గా అయిన తర్వాత గ్రేవీని సర్వింగ్ బౌల్లోనికి మార్చుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Story first published: Tuesday, April 5, 2016, 13:01 [IST]
Desktop Bottom Promotion