For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ అండ్ టేస్టీ ఆనియన్ చికెన్ గ్రేవీ రిసిపి

|

సౌత్ ఇండియన్ చికెన్ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటాయి. ముఖ్యంగా చికెన్ వంటలు స్పైసీగా నోరూరిస్తుంటాయి. ఈ మాంసాహారాల వంటలకు కొన్ని మసాలాలు జోడించి తయారుచేయడం వల్ల మరింత ఎక్కువ టేస్ట్ వస్తుంది.

ఈ సింపుల్ చికెన్ గ్రేవీ రిసిపికి ఉల్లిపాయలు,అల్లం వెల్లుల్లి, కారం, టమోటోలు అదనపు టేస్ట్ ను అందిస్తాయి. అంతే కాదు, ఈ చికెన్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. ఈ టేస్టీ చికెన్ గ్రేవీ రిసిపి చపాతీలు లేదా తందూరి రోటీలకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆంధ్రా స్టైల్లో తయారుచేస్తే హాట్ అండ్ స్పైసీగా నోరూరిస్తుంటుంది. మరి ఈ టేస్టీ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Onion Chicken Gravy Recipe

కావల్సిన పదార్థాలు:

  • చికెన్ - 500 g
  • ఉల్లిపాయలు - 2 cups (finely chopped)
  • టమోటో - 1 cup (finely chopped)
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 teaspoon
  • పచ్చిమిర్చి - 5 to 6
  • పెరుగు - 1 cup
  • కారం - 1/2 teaspoon
  • నూనె: తగినంత
  • ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాి.
2. నూనె వేడి అయ్యాక అందులో ఉల్లిపాయలు ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే టమోటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి.
4. టమోటో మెత్తబడే వరకూ 10 నిముషాలు వేగించుకోవాలి.
5. మరో పాన్ లో ఆయిల్ వేసి, చికెన్ ముక్కలు వేసి షాలో ఫ్రై చేసుకోవాలి.
6. పది నిముషాల తర్వాత ముందుగా వేపుకుంటున్న పోపులో చికెన్ ముక్కలను ట్రాన్స్ ఫర్ చేయాలి. మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే పెరుగు, కారం వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమం చిక్కగా మారే వరకూ ఉడికించుకోవాలి. అంతే ఆనియన్ చికెన్ గ్రేవీ రిసిపి రెడీ...

English summary

Spicy Onion Chicken Gravy Recipe

This recipe is a very spicy and tasty recipe and it's surely going to be a treat to all the chicken lovers. You can prepare this recipe when you invite guests, as we always believe in serving the best foods to our guests.
Story first published:Thursday, May 19, 2016, 17:36 [IST]
Desktop Bottom Promotion