For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ అండ్ క్విక్ ప్రాన్ కర్రీ రిసిపి

|

చాలా మందికి సీఫుడ్ అంటే చాలా ఇష్టం. సీఫుడ్స్ లో ప్రాన్స్ ను పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాబట్టి ప్రాన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఉపయోగించే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకోసం ప్రత్యేకంగా తయారు చేసేటప్పుడు ఈ వంట యొక్క కలర్, ఆకారం, రుచి అన్నీ కూడా చాలా ముఖ్యం. అందుకే ప్రాన్స్ ను వండేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా తయారు చేయాలి. అప్పుడే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది చూడగానే తినాలనిపించే వంటకం.

మీ పిల్లలు ప్రాన్స్ ను ఇష్టపడుతంటే కనుక ప్రాన్ కర్రీ ఒక మంచి వంటకం. ఇది చాలా సింపుల్ రిసిపి. ఇది చూడటానికి నోరూరిస్తూ, రుచికరంగా ఉండే డెలిషియస్ డిష్. ప్రాన్ కర్రీకి ఉపయోగించే పసుపు, ఎండు మిర్చి, ఇతర మసాలా దినుసులేవి ఈ సీఫుడ్ లో వాడరు. ఈ ప్రాన్ కర్రీ రిసిపి టేస్ట్ ముఖ్యంగా వెల్లుల్లి, టమోటోల మీద ఆధారపడి ఉంటుంది . కరివేపాకు మరింత ప్లేవర్ ను ఇస్తూ చాలా కలర్ ఫుల్ సీ ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తుంటుంది. మరి మీకూ ఈ సింపుల్ ప్రాన్ కర్రీని తినాలనుందా..? ఐతే ఈ క్రింది పద్దతిని ఫాలో అవ్వండి...

Spicy And Quick Prawn Curry Recipe: Telugu Vantalu


కావల్సిన పదార్థాలు:
ప్రాన్స్ - 200 gms
ఎండుమిర్చి - 6 to 7
ధనియాలు- 2 tbsp
కొబ్బరి తురుము - 1/2 cup
పెప్పర్ పౌడర్ - 1/4 tsp
ధనియాలపొడి- 1/4 tsp
టమోటోలు- 3
ఉల్లిపాయ - 1cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1tbsp
ఉప్పు: కొద్దిగా
నూనె: సరిపడా

తయారుచేయు విధానం:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక అందులో ప్రాన్స్ వేసి 5 నిముషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి తురుము కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి.
3. తర్వాత రెండు టమోటోలు తీసుకొని వీటిని మరో మిక్సీ జార్ లో వేసుకోవాలి. నీరు మిక్స్ చేయకుండా గ్రైండ్ చేసుకోవడం వల్ల మొత్తగా పేస్ట్ తయారవుతుంది.
4. ఇప్పుడు స్టౌ మీద మరో పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులోనే టమోటో గుజ్జు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న ప్రాన్స్ కూడా వేసి గ్రేవీలో మిక్స్ చేస్తూ ప్రాన్స్ కు బాగా పట్టే వరకూ అలాగే ఫ్రై చేసుకోవాలి. 10 నుండి 15 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేసుకోవాలి.
6. అంతే వేడి వేడిగా ప్రాన్ కర్రీని సర్వ్ చేయాలి.

English summary

Spicy And Quick Prawn Curry Recipe: Telugu Vantalu

Spicy And Quick Prawn Curry Recipe: Telugu Vantalu. Prawn is a very good food to be included in the daily diet. Prawns are rich in protiens, vitamins and are also good for those who are aiming for weight loss as prawns are low in calories.Consuming prawns regularly is considered good for health..
Story first published: Thursday, September 10, 2015, 15:12 [IST]
Desktop Bottom Promotion