For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ థాయ్ చికెన్ విత్ బాసిల్ హాట్ అండ్ స్పైసీ

|

థాయ్ ఫుడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే మన ఇండియాలో అంత పాపులర్ అయ్యాయి. ఈ వంటలు చాలా స్పైసీగా మరియు గొప్ప రుచిని కలిగి ఉంటాయి . సాధారణంగా థాయ్ ఫుడ్స్ కు చాలా సింపుల్ వస్తువులను మరియు హెర్బ్స్ ను ఉపయోగిస్తుంటారు. అందుకు చాలా టేస్టీగా ఉంటాయి. అటువంటి టేస్ట్ ఆహారాల్లో ఈ థాయ్ చికెన్ బాసిల్ రిసిపి ఒకటి.

ఈ చలికాలంలో బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు సైసీగా వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇటువంటి థాయ్ రిసిపిలు ఉత్తమ ఎంపిక. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, వాళ్లకు రంగులు మాత్రమే కాదు. రుచికరమైన కూరలు. రుచి మాత్రమే కాదు. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న కూరలు. ఈ తరహా కూరలకు థాయ్‌లాండ్ ప్రసిద్ధి. వీటిని చేయటానికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ల కూరల్లో వెజ్, నాన్‌వెజ్ రెండూ ఉన్నాయి.

ఈ స్పెషల్ థాయ్ చికెన్ బాసిల్ రిసిపి మన ఇండియన్ స్టైల్లో ఇంట్లో తయారుచేయాలో తెలుసుకుందాం...
Serves: 2
Preparation time: 10 minutes
Cooking time: 30 minutes

కావల్సిన పదార్థాలు:
చికెన్ బ్రెస్ట్ : (బోన్ లెస్/చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తాజా తులసి ఆకులు: 1/2cup
తాజా ఎండు మిర్చి: 3(మద్యకు కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి: 2tbsp(కట్ చేసుకోవాలి)
ఫిష్ సాస్: 1tbsp
సోయా సాస్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: 1tsp
నూనె: 4tbsp

Spicy Thai Chicken With Basil Recipe

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి , ఫిష్ సాస్ తో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వోక్ లేదా పాన్ లో రెండు చెంచాలా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో కట్ చేసిన వెల్లుల్లి వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేయాలి.
4. మరో పాన్ లో, మరో రెండు చెంచాల నూనె వేసి బాసిల్ లీవ్స్(తులసి ఆకుల)ను వేసి క్రిస్పీగా అయ్యే వరకూ వేగించుకొని పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత వేగుతున్న చికెన్ లో రెడ్ చిల్లీ, సోయా సాస్, ఉప్పు మరియు పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి.
6. ఫ్రై చేస్తూనే అందులో వేగించి పెట్టుకొన్న తులసి ఆకులను వేసి మొత్తం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
7. చికెన్ మెత్తగా ఉడికే వరకూ ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి.
8. చికెన్ ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. అంతే స్పైష్ థాయ్ చికెన్ బాసిల్ రెడీ. ఫ్రైడ్ రైస్ కు సైడ్ డిష్ గాను లేదా ఆప్టిటైజర్ గాను సర్వ్ చేయవచ్చు.

Story first published: Thursday, November 13, 2014, 17:37 [IST]
Desktop Bottom Promotion