For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ అండ్ టేస్టీ చికెన్ మెకరోని సలాడ్ రిసిపి

|

మాకరోనీ చికెన్ సలాడ్ ను డేలో ఎప్పుడైనా వండించవచ్చు. మరియు తినొచ్చు. ఇది ఆకలిని తగ్గిస్తుంది . అంతే కాదు, పొట్ట నింపి హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది. ఈ వండర్ ఫుల్ డిష్ హెల్తీ అండ్ టేస్టీ రిసిపిని మీరు తప్పని సరిగా ట్రై చేయాల్సిందే.

ఈ మాకరోని చికెన్ సలాడ్ రిసిపిని మరింత టేస్టీగా తయారుచేయాలంటే, దీనికి మాకరోనీ ని జోడించాల్సిందే. మాకరోనీ జోడించడం వల్ల ఈ డిష్ మరింత కలర్ ఫుల్ గా మరియు టేస్టీగా ఉంటుంది. అంతే కాదు, మళ్ళ మళ్లీ తినాలనిపిస్తుంది. మరి ఈ టేస్టీ డిలైట్ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Tasty Chicken Macaroni Salad Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్ బ్రెస్ట్ - 250 grms (చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించాలి)
మాకరోనీ - 400grms
క్యారట్లు - 1cup
ఉల్లిపాయలు - 1cup
రెడ్ కాప్సికం - 1cup
అల్లం & వెల్లుల్లి పేస్ట్ - 1tsp
క్యాబేజీ - 1cup
పచ్చిమిర్చి - 5 -6
మయోన్నైస్ - 2tsp
పెప్పర్ పౌడర్ - 1/2tsp
ఉప్పు : రుచికి తగినంత
ఆలివ్ నూనె: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొదిగా నీళ్ళు పోయాలి. తర్వాత అందులో మెకరోని వేసి 15 నిముషాలు ఉడికించుకోవాలి.

2. మాకరోనీ సాఫ్ట్ గా ఉడికిన తర్వాత , హాట్ వాటర్ వంపేసి అందులో కొద్దిగా చల్లటి నీరు పోయాలి.

3. 5 నిముషాల తర్వాత చల్లటి నీరు కూడా పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి.

4. తర్వాత పాన్ స్టౌ మీద పెట్టి అందులో ఆలివ్ ఆయిల్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, రెడ్ క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజ్ మరియు పచ్చిమిర్చి వేయాలి. మీడియం మంట మీద వీటన్నింటిని వేగించుకోవాలి.

5. తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకొన్న మాకరోనీ వేసి, కొద్దిగా ఉప్ప వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకుంటూ ప్రై చేయాలి.

6. తర్వాత ముందుగా కట్ చేసి, ఉడికించి పెట్టుకొన్ని చికెన్ కూడా వేసి ఫ్రై చేయాలి . చివరగా మోయోనైజ్ మరియు పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. మొత్తం పదార్థాలన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అంతే మాకరోని చికెన్ సలాడ్ రెడీ.

English summary

Tasty Chicken Macaroni Salad Recipe

The chicken salad recipe can be served at any time during the day, as it curbs your hunger and in the mean time makes you feel happy for tasting such a wonderful dish. It is a very healthy and tasty recipe that you must try.
Story first published: Saturday, February 6, 2016, 16:09 [IST]
Desktop Bottom Promotion