For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిష్ ఫ్రైడ్ రేస్ : హెల్లీ అండ్ టేస్టీ

|

ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత ఈజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే.సాధారణంగా మన శరీరానికి చాలా రకలా విటమిన్లు, ప్రోటీనులు అవసరం. వీటితో పాటు మన శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా అవసరం అవుతుంది. మనశరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సీ ఫుడ్ ను మన డైలీ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. సీఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎందుకంటే ఇందులో వివిధ రకాలైన విటమిన్లు, ప్రోటీనులు మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫిష్ లో మంచి క్రొవ్వులను (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్)కలిగి ఉంటుంది. అందుకే హార్ట్ పేషంట్స్ ను చాలా మంచిది. కార్డియో వ్యాస్కులార్ డిసీజ్(గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను)నివారించడానికి ఫిష్ తినడం చాలా అవసరం. చేపల తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడానికి తగ్గిస్తుంది. చేపల్లో కూడా చాలా రకాలు న్నాయి. సాల్మన్, మకెరెల్, తున, స్వోర్డ్ ఫిష్, వీక్ ఫిష్, సార్డిన్స్, మొదలగునవి. వీటిని వండినప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి. మరి చేపలతో ఫిష్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

fish fried rice

బోన్ లెస్ ఫిష్: 1/2kg
వండిన అన్నం: 3 cups
సన్నగా తరిగిన క్యాప్సికమ్: 2cups
ఉల్లిపాయలు: 3మీడియం
కొత్తిమీర: 1/2cup
ఫిష్ సాస్: 1tbsp
చిల్లీ సాస్: 2tbsp
వెల్లుల్లి రెబ్బలు: 3-4
సోయాసాస్: 3tsp
అల్లం తురుము: 1tbsp
క్యారెట్: 2 చిన్నవి
పెప్పర్ పౌడర్: 1tsp
కార్న్ స్టార్చ్- 1tbsp
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా చేపలను మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవాలి. తర్వాత నీటితో శుభ్రంగా కడిగి తడి ఆరే వరకూ ఉండి. వాటికి చిల్లీ సాస్ మరియు పెప్పర్ పౌడర్ ను చిలకరించి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. చేపలను మ్యారినేట్ చేసిన తర్వాత 15 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అందులో కార్న్ స్ట్రార్చ్ పౌడర్ ను ఫ్రై చేయడానికి ముందుగా చేప ముక్కల మీద చిలకరించి పెట్టుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ 10 నిముషాలు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి.
5. తర్వాత అదే పాన్ లో ఉన్నవేడి నూనెలో అల్లం వెల్లుల్లి తరుగు వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యాప్సికమ్ మరియు క్యారెట్ ను వేసి 10నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసిన చేపలు మరియు వేసి ఫ్రై చేయాలి.
8. తర్వాత అందులోనే ముందుగా వండిపెట్టుకొన్న అన్నం వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే ఫిష్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని సలాడ్ తో సర్వ్ చేసుకోవచ్చు.

English summary

Tasty Fish Fried Rice Recipe: Telugu Vantalu

You have tried chicken fried rice, now this time try out this yummy fish fried rice. It is easy to prepare and gives a unique taste of fish. This way you can make your kids also to eat fish, as most kids don't like to eat this nutritious food.
Story first published: Thursday, July 30, 2015, 16:12 [IST]
Desktop Bottom Promotion