For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ ఫిష్ కర్రీ: థాయ్ స్పెషల్

|

థాయ్ ఫుడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే మన ఇండియాలో అంత పాపులర్ అయ్యాయి. ఈ వంటలు చాలా స్పైసీగా మరియు గొప్ప రుచిని కలిగి ఉంటాయి . సాధారణంగా థాయ్ ఫుడ్స్ కు చాలా సింపుల్ పదార్థాలను మరియు హెర్బ్స్ ను ఉపయోగిస్తుంటారు. అందుకే చాలా టేస్టీగా ఉంటాయి. అటువంటి టేస్ట్ ఆహారాల్లో ఈ థాయ్ ఫిష్ గ్రీన్ కర్రీ రిసిపి ఒకటి.

ఈ చలికాలంలో బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు సైసీగా వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇటువంటి థాయ్ రిసిపిలు ఉత్తమ ఎంపిక. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, వాళ్లకు రంగులు మాత్రమే కాదు. రుచికరమైన కూరలు. రుచి మాత్రమే కాదు. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న కూరలు. ఈ తరహా కూరలకు థాయ్‌లాండ్ ప్రసిద్ధి. వీటిని చేయటానికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ల కూరల్లో వెజ్, నాన్‌వెజ్ రెండూ ఉన్నాయి. ఈ రోజు మీకు పరిచయం చేస్తున్న థాయ్ ఫిష్ కర్రీకి కొన్ని వెజిటేబుల్స్ జోడించడం వల్ల చలికిలంలో ఇమ్యునిటిని పెంచే కొన్ని పోషకాలు కడా మన శరీరానికి అందుతాయి. దాంతో మన శరీరంలో వ్యాధి నిరోధకత పెంచుతాయి. మరి ఈ థాయ్ గ్రీన్ ఫిష్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం,.....

Thai Green Fish Curry

కావల్సిన పదార్థాలు:
ఫిష్ ఫిల్లెట్: 4
కార్న్ ఫ్లోర్: 1tbsp
ఉప్పు: 1/2tbsp
నూనె: 2tsp

గ్రీన్ కర్రీ పేస్ట్ కోసం కావల్సినవి:
పచ్చిమిర్చి: 6
తులసి: 1/2cup
కొత్తమీర: 1cup
స్ప్రింగ్ ఆనియన్స్: 4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం: 1tbsp(సన్నగా తరిగినది)
వెల్లుల్లి రెబ్బలు: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ధనియాలపొడి: 1tbsp
లెమన్ గ్రాస్: 1tbsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2tsp
నిమ్మరసం: 4tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆలివ్ ఆయిల్: 1tbsp
నీళ్ళు: 1/4cup

గ్రీన్ కర్రీ కోసం కావల్సినవి:
కోకోనట్ మిల్క్: 2cups(పచ్చికొబ్బరితురుమును మిక్సీలో వేసి పేస్ట్ చేసి నీళ్ళు పోసి వడగట్టుకోవాలి)
వెజిటేబు స్టాక్: 1cup(కూరగాయాలు ఉడికించిన నీళ్ళు)
బేబీ కార్న్: 3(sliced)
రెడ్ క్యాప్సికమ్: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
గ్రీన్ క్యాప్సికమ్: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
మష్రుమ్: 5(సన్నగా కట్ చేసుకోవాలి)
ఫిష్ సాస్: 2tsp
కొత్తిమీర: 1tsp(గార్నిష్ కోసం సన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా గ్రీన్ పేస్ట్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నీ మిక్సీలో వేసి కొద్దిగా నీరు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఫిష్ ఫిల్లెట్ ను శుభ్రం చేసుకోవాలి.
3. ఒక ప్లేట్ లో కార్న్ ఫ్లోర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఫిష్ ఫిల్లెట్ ను అందులో వేసి పొర్లించాలి.
4. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో కార్న్ ఫ్లోర్ పట్టించి పెట్టిన ఫిష్ ఫిల్లెట్ ను వేసి 5-10నిముషాల బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. ఇలా తయారుచేసుకొన్న తరవ్ాత వాటిని ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకొన్న గ్రీన్ కర్రీ పేస్ట్ వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత అందులోనే వెజిటేబుల్స్, ఫిష్ సాస్, వెజిటేబుల్ స్టాక్ మరియు కోకనట్ మిల్క్ వేసి, మొత్తం మిశ్రమాన్ని కలిపుతూ ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు సరిచూసుకోవాలి.
8. 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించి, స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
9. తర్వాత ఈ గ్రీన్ కర్రీలో ముందుగా ఫ్రై చేసుకొన్న ఫిష్ ను వేసి మిక్స్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే థాయ్ గ్రీన్ ఫిష్ కర్రీ రెడీ. ఇది అన్నంకు చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Thai Green Fish Curry

Thai food is greatly influenced by the cuisine of both India and China. But it is definitely distinct in its taste and flavours. The combination of the aromatic spices, herbs and vegetables in Thai food make it simply irresistible in terms of its taste and appearance. The best part of Thai cuisine is the balanced combination of sweet, sour and spicy tastes.
Story first published: Friday, November 28, 2014, 17:12 [IST]
Desktop Bottom Promotion