For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అహా...ఓహో అనిపించే హోం మేడ్ చికెన్ పిజ్జా రిసిపి

|

పిజ్జాలు ఓరిజినల్ ప్లేస్ ఇటలీయే అయినా, మన సొంత ఫుడ్ లాగా అందరూ ఇష్టపడే పిజ్జాని తినని వారు, తెలియని వారు ఉండరమో....వివిధ రకాల వెజిటేబుల్స్, చికెన్, పనీర్, బేబీ కార్న్, మష్రుమ్స్, ఆలివ్స్ ఇలా వేటితోనైనాన టమోటో సాస్, చీజ్ తో కలిపి టాపింగ్ చేసి తయారుచేసే పిజ్జా అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి.

చిన్న చిన్న బేకరీల దగ్గరి నుండి బ్రాండెడ్ పిజ్జా హాట్స్ వరకూ ఎన్నో వెరైటీలు దొరికినా ఇంట్లో చేసుకునే పిజ్జానే మనకు చాలా టేస్ట్ గా...హెల్తీగా ఉంటుంది. పిల్లలు మరియు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఈ వీకెండ్ లో చికన్ పిజ్జా రిసిపిని ట్రై చేసి...టేస్ట్ చేయండి...

Yammy and Tasty Chicken Pizza Recipe

కావల్సిన పదార్థాలు:
కావలసిన పదార్థాలు: రెడీమేడ్ పిజ్జా బేస్:
చికెన్ కీమా: 100grm
జీడిపప్పు పేస్ట్: 1/2cup
వెన్న: 100grm
ఛీజ్ తురుము: 50grm
ఛీజ్ పేస్ట్: 50grm
మంచినీళ్లు: 1cup
టొమోటో సాస్: 1tsp
కొత్తిమీర తురుము: 2tsp
పుదీనా తురుము: 1tsp
కారం: 1/4 tsp
ధనియాలపొడి: 1/4 tsp
గరంమసాలా: 1/4 tsp
మిరియాలపొడి: 1/4 tsp
ఉప్పు: రుచికి సరిపడా
పంచదారపొడి: చిటికెడు
వెల్లుల్లి ముక్కలు: కొద్దిగా

తయారు చేయు విధానము:
1. ఒక పాత్రలో కాస్తంత ఛీజ్ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, పంచదార పొడి వేసి బాగా స్సూన్ తో కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో మిగిలిన వెన్న వేసి కరిగాక పుదీనా, వెల్లుల్లి వేసి కాసేపు వేయించాలి. అందులోనే చికెన్ కీమా వేసి, మిగిలిన జీడిపప్పు పేస్ట్, తగినింత ఉప్పు వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి.
3. తర్వాత పై మిశ్రమంలోనే కారం, ధనియాలపొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి సగం టొమోటో సాస్, కొత్తమీర, తగినంత ఉప్పువేసి బాగా కలిపి నీళ్లు పోసి కాస్త గ్రేవీ ఉండేలా ఉడికించి దింపుకోవాలి.
4. చివర్లో పిజ్జా బేస్ మీద, మొదట్టో తయారు చేసుకున్న వెన్న మిశ్రమాన్ని రాసి పైన చికెన్ కీమా కూరని సర్ధాలి. దీనిపైన కొత్తిమీర తురుము, చీజ్ తురుము కూడా చల్లి ఓవెన్‌ లో ఒక 5 నిమిషాలపాటు పెట్టి హీట్ అయిన తర్వాత తీసేయాలి. అంతే చికెన్ పిజ్జా రెడీ.

English summary

Yammy and Tasty Chicken Pizza Recipe

Yammy and Tasty Chicken Pizza Recipe, Italian is one of the favourite cuisines in the world. From kids to adults, we all love to have the cheesy bites of pizzas, pastas and lasagnas. There are many Italian recipes that you can prepare at home as well! So why waste money in expensive Italian restaurants when you can prepare them at home?
Story first published: Friday, February 19, 2016, 16:55 [IST]
Desktop Bottom Promotion