Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
దోశ, ఇడ్లీ రుచిని రెట్టింపు చేసే నార్త్ ఇండియన్ స్టైల్ టమాటో చట్నీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఇడ్లీలు ఎంత మెత్తగా ఉన్నా, దోశలు ఎంత కరకరలాడుతూ ఉన్నా.. వాటి రుచిని పెంచేది మాత్రం పక్కన ఉండే చట్నీ మాత్రమే. సాధారణంగా మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా మామూలు టమాటో చట్నీలను రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం. కానీ రోజు తినే చట్నీలే తింటే ఇంట్లో వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది.
అందుకే ఈసారి సరికొత్త రుచిని అందించే నార్త్ ఇండియన్ స్టైల్ రోస్టెడ్ టమాటో చట్నీ తయారుచేసుకోండి. ఈ రుచి మీ నాలుకకు కొత్త అనుభూతిని ఇవ్వడమే కాకుండా, ఇంట్లో వాళ్ళు మరో రెండు ఇడ్లీలు ఎక్కువే తినేలా చేస్తుంది. నార్త్ ఇండియన్ స్టైల్ రోస్టెడ్ టమాటో చట్నీ మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
టమోటాలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 5
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. స్టవ్ వెలిగించి, మంట మీద నేరుగా టమాటాలను ఉంచాలి (దీని కోసం పుల్కా స్టాండ్ వాడవచ్చు).
-టమాటా తొక్క నల్లగా మారి, లోపల మెత్తబడే వరకు అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత వాటిని ఒక పల్లెంలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి, వాటిని ఒక ఫోర్క్ లేదా పుల్లకి గుచ్చి స్టవ్ మంటపై దోరగా కాల్చుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా నిప్పుల మీద తొక్క నల్లబడే వరకు కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి.
-కాల్చిన టమోటాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి కాస్త చల్లారిన తర్వాత, వాటిపై నల్లగా మారిన తొక్కను నెమ్మదిగా తీసేయాలి. తొక్క తీశాక వాటిని నీటితో కడగకూడదు, అలా చేస్తే స్మోకీ రుచి పోతుంది.
-ఇప్పుడు ఒక రోట్లో కాల్చిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, చిటికెడు ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోలు లేకపోతే మిక్సీలో వేయవచ్చు కానీ, మరీ మెత్తగా పేస్ట్ లా చేయకూడదు. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-అదే రోట్లో లేదా గిన్నెలో తొక్క తీసిన టమాటాలను వేసి మెత్తగా నలుపుకోవాలి. టమాటా ముక్కలు మరీ చిన్నగా కాకుండా, అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది.
-ఇప్పుడు మెత్తగా చేసిన టమాటా గుజ్జులో, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి-పచ్చిమిర్చి మిశ్రమాన్ని కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక స్పూన్ నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే నార్త్ ఇండియన్ స్టైల్ టమాటో చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీ, దోశ లేదా అన్నంలోకి కూడా ఇది చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications