Latest Updates
-
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!
నుచినుండె రెసిపి ; కర్ణాటక రకం ఘాటైన పప్పు ఉండలు తయారీ ఎలా
కర్ణాటక వారి నుచినుండే సంప్రదాయ వంటకాన్ని పొద్దున ఉపాహారంలో లేదా చిరుతిళ్ళలో తింటారు. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. వీడియోలు, చిత్రాలతో కూడిన తయారీవిధానం చదవండి.
కర్ణాటక వారి నుచినుండే సంప్రదాయ వంటకాన్ని పొద్దున ఉపాహారంలో లేదా చిరుతిళ్ళలో తినండి. కన్నడలో 'నుచ్చు' అంటే పప్పు మరియు 'ఉండె' అంటే ఉండలు. అందుకని నుచిన ఉండె అంటే పప్పు ఉండలు.
ఈ కర్ణాటక రకం పప్పు ఉండలను కందిపప్పుతో తయారుచేస్తారు. కొన్నిచోట్ల సెనగపప్పుతో కూడా చేస్తారు. వీటిని కుక్కర్ లేదా ఇడ్లీ పెనంలో ఉడికిస్తారు. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి, కొవ్వు తక్కువ పదార్థాలు కూడా. అందుకని ఎటువంటి బాధలేకుండా తినేయచ్చు.
ఈ ఉడికిన ఉండలను మజ్జిగపులుసు లేదా మజ్జిగె హులి అనే పెరుగు సంబంధ
వంటకాలతో కలిపి తింటారు. ఈ తయారీలో మేము దిల్ ఆకులను వాడాం. అవి
తప్పనిసరి కాదు. వాటి బదులు క్యారట్ లేదా కొత్తిమీరను
వాడుకోవచ్చు.
ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని ఇంటివద్దనే సులభంగా చేసుకోవచ్చు. పొద్దున
బ్రేక్ ఫాస్ట్ కి త్వరగా ఈ రుచికర వంటకాన్ని వండుకోవచ్చు. పొద్దున
ఆహారానికి ఏదన్నా కొత్తగా ప్రయత్నించడానికి వీడియోలు, చిత్రాలతో కూడిన
తయారీవిధానం చదవండి.

Recipe By: సుమా జయంత్
Recipe Type: ఉపాహారం
Serves: 20 ఉండలు
-
కందిపప్పు - 1 గిన్నె
నీరు - ½ లీటరు + 3 కప్పులు
పచ్చిమిర్చి - 10-20 (కావాల్సిన ఘాటు ప్రకారం)
అల్లం(చెక్కు తీసినది) - 4 (ఒక అంగుళం ముక్కలు)
తరిగిన కొబ్బరి -1 కప్పు
కొబ్బరి ముక్కలు -1/2 కప్పు
దిల్ ఆకులు -2 కప్పులు
ఉప్పు రుచికి తగ్గట్టు
జీలకర్ర - 2 చెంచాలు
నూనె - జిడ్డుకి తగినంత
-
- కలిపే పెద్ద గిన్నెలో కందిపప్పు వేయండి.
- దాన్ని 3 కప్పుల్లో నీరు 5-6 గంటలు నానబెట్టి , ఎక్కువ నీరును తీసేయండి.
- మిక్సి జార్ లో పచ్చిమిరపకాయలను వేయండి.
- అల్లం ముక్కలు వేసుకోండి.
- నానబెట్టిన కందిపప్పును ఒక గరిటెను వేయండి.
- మిక్సీపట్టి పేస్టులా తయారుచేయండి.
- పెనంలోకి మార్చండి.
- అదే మిక్సీజార్లో మరో గరిటె కందిపప్పు కలపండి.
- దాన్ని కూడా మిశ్రమం చేసి పెనంలోకి మార్చుకోండి.
- మొత్తం కందిపప్పు మిక్సీ అయ్యేవరకూ ఇదే పద్ధతి పాటించండి.
- అయ్యాక, తరిగిన కొబ్బరి తురుమును వేయండి.
- కొబ్బరి ముక్కలను వేయండి.
- దిల్ ఆకులు, ఉప్పును కలపండి.
- బాగా కలపండి.
- జీలకర్రను వేసి, బాగా కలిపి, పక్కన పెట్టుకోండి.
- అరలీటరు నీరును వేడి ఇడ్లీ పెనంకు జతచేయండి.
- ఇడ్లీ ప్లేటును పైన పెట్టండి.
- ఇడ్లీ ప్లేటుకు నూనెను రాయండి.
- మిశ్రమంలో కొంచెం భాగాలను తీసుకుని , చిన్న బంతుల్లా మీ చేతితో కట్టండి.
- ఈ ఉండలను ఇడ్లీ ప్లేటులో వేయండి.
- పైన మూతపెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వండి.
- మూత జాగ్రత్తగా తీసి ఉడికిన ఉండలను బయటకి తీయండి.
- పళ్ళెంలోకి మార్చి వడ్డించండి.
- 1. దిల్ ఆకులు వేసుకోవడం తప్పనిసరి కాదు.
- 2. దిల్ ఆకుల బదులు తురిమిన క్యారట్ మరియు కొత్తిమీరను కూడా వాడుకోవచ్చు.
- వడ్డించే పరిమాణం - 1 ముక్క
- క్యాలరీలు - 70 క్యాలరీలు
- కొవ్వు - 0.9 గ్రాములు
- ప్రొటీన్ - 1 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 10 గ్రాములు
- చక్కెర - 1 గ్రాములు
- ఫైబర్ - 1.6 గ్రాములు
స్టెప్ బై స్టెప్ - నుచినుండే తయారీ ఎలా
1. కలిపే పెద్ద గిన్నెలో కందిపప్పు 1 బౌల్ వేయండి.

2. దాన్ని నీటితో 5-6 గంటలు నానబెట్టండి , ( 3 కప్పుల నీరును వాడి, ఎక్కువ నీరును తీసేయండి).

3. మిక్సి జార్ లో పచ్చిమిరపకాయలను వేయండి.10-20 (చిన్నవి) (వాటి ఘాటును బట్టి).

4. అల్లం ముక్కలు వేసుకోండి.4 (ఒక అంగుళం ముక్కలు).

5. నానబెట్టిన కందిపప్పును ఒక గరిటెను వేయండి.

6. మిక్సీపట్టి పేస్టులా తయారుచేయండి.

7. పెనంలోకి మార్చండి.

8. అదే మిక్సీజార్లో మరో గరిటె కందిపప్పు కలపండి(1 లేదా 2 గరిటెల కందిపప్పు).

9. దాన్ని కూడా మిశ్రమం చేయండి.


10. (మొత్తం కందిపప్పు మిక్సీ అయ్యేవరకూ) ఇదే పద్ధతి పాటించండి.

11. అయ్యాక, తరిగిన కొబ్బరి తురుమును వేయండి. 1 కప్పు

12. కొబ్బరి ముక్కలను వేయండి. ½ కప్పు (బాగా సన్నగా తరిగినవి)

13. దిల్ ఆకులు కలపండి. 2 కప్పులు


14. ఉప్పు వేయండి.

15. బాగా కలపండి.


16. జీలకర్ర 2 చెంచాలను వేయండి.

17. బాగా కలిపి పక్కన పెట్టుకోండి.

18. 1/2 లీటరు నీరును వేడి ఇడ్లీ పెనంకు జతచేయండి.

19. ఇడ్లీ ప్లేటును పైన పెట్టండి.

20. ఇడ్లీ ప్లేటుకు నూనెను రాయండి.

21. మిశ్రమంలో కొంచెం భాగాలను తీసుకుని , చిన్న బంతుల్లా మీ చేతితో కట్టండి.

22. ఈ ఉండలను ఇడ్లీ ప్లేటులో వేయండి.

23. పైన మూతపెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వండి.

24. మూత జాగ్రత్తగా తీసి ఉడికిన ఉండలను బయటకి తీయండి.

25. పళ్ళెంలోకి మార్చి వడ్డించండి.

Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
