Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
విటమిన్ల లోపం పోగొట్టే నువ్వుల అన్నం..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్..మిగిలిపోయిన రైస్ తో ఎలా చేసుకోవాలంటే..
మిగిలిపోయిన అన్నంతో రకరకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా,ఇంతకుముందెన్నడు టేస్ట్ చేయచని విధంగా రుచికరంగా ఉంటాయి. అలాంటి ఒక వంటకమే నువ్వుల అన్నం. తమిళనాడులో ఎల్లు సాదం అని ఈ వంటకాన్ని పిలుస్తారు. తమిళనాడులో శివాలయాల్లో శనివారం దీన్ని ప్రసాదంగా కూడా అందిస్తుంటారు. శని త్రయోదశికి శనీర్వుడికి పూజలు చేసిన తర్వాత దీనినే ప్రసాదంగా పెడతారు. ఎన్నో పోషకాలతో నిండిన వంటకం ఇది. లంచ్ బాక్సులకి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది.
మిగిలిపోయిన అన్నమే కాకుండా అప్పుడే వండిన అన్నంతో కూడా దీన్ని తయారుచేసుకోవచ్చు. ఈ రెసిపిలో వాడే నల్ల నువ్వులు వాటి అధిక పోషక విలువలకు, ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లకు ప్రసిద్ధి చెందాయి. తమిళనాడు స్టైల్ లో నల్ల నువ్వుల అన్నం రెసిపి మీ ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

నువ్వుల అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
-నల్ల నువ్వులు
-అన్నం
-ఎండుమిర్చి
-ఉప్పు
-కరివేపాకు
-మినపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-పచ్చి శెనగపప్పు
-చల్ల మిరపకాయలు
-నూనె
నువ్వుల అన్నం తయారీ విధానం
-మిగిలిపోయిన అన్నంతో టేస్టీ నువ్వుల అన్నం.. విటమిన్స్ లోపం పొగొడుతుంది,లంచ్ బాక్సుకి పర్ఫెక్ట్.. ఎలా చేసుకోవాలంటే
-ముందుగా నువ్వుల పొడి కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 6 ఎండుమిరపకాయలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి గోల్డెన్ డ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో 3 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు, రెండు రెబ్బల కరివేపాకు వేసి నువ్వులు చిటచిటమనేదాకా వేయించాలి. నువ్వులు చిట్లుతున్న సమయంలో రెండు చిటికెళ్ల ఇంగువ కూడా అందులో వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ఇప్పుడు వేయించినవన్నీ మిక్సీలో వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత ఒకటిన్నర కప్పుల పొడి పొడి అన్నంలో గ్రైండ్ చేసుకున్న పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె పోసి వేడి చేసి ఇందులో 1 టీస్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 3 చల్ల మిరపకాయల ముక్కలు,1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తాళింపు ఎర్రబడుతున్న సమయంలో 1 టీస్పూన్ జీలకర్ర,కరివేపాకు వేసి వేయించండి.
-ఇప్పుడు వేగిన తాళింపులో కలిపిపెట్టుకున్న నువ్వుల అన్నం వేసి కలపండి. అంతే టేస్టీ నువ్వుల అన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications