Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఆమ్లెట్ తినాలి.. సింపుల్‌లో ఎలా చేసుకోవాలో తెలుసా?
ఈ మధ్య కాలంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టే వారికి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన ఆహరం తినడంతో పాటు.. ఆరోగ్యకరమైన డైట్‌ను అనుసరిస్తున్నారు. అందుకోసం ప్రతిరోజూ ఇడ్లి, దోష, బోండా వంటివి కాకుండా కాస్త ఆరోగ్యవంతమైన ఆహరం తినాలని ఓట్స్‌ను తమ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు. అయితే రోజూ కేవలం ఓట్స్ తింటే బొర్ కొడుతుంది. అందుకే ఈరోజు ఓట్స్ ఆమ్లెట్ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..
ఓట్స్ ఆమ్లెట్ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు ఓట్స్
- సరిపడా పాలు
- మూడు గుడ్లు
- రుచికి సరిపడా ఉప్పు
- పావు టీస్పూన్ మిరియాల పొడి
- కొద్దిగా తరిగిన ఉల్లిపాయ
- కొద్దిగా తరిగిన క్యాప్సికం
- ఒక టమోటా
- రెండు పచ్చిమిర్చి
- కొద్దిగా తరిగిన కొత్తిమీర
- కొంచెం క్యారెట్ తురుము
- సరిపడా నూనె

ఓట్స్ ఆమ్లెట్ తయారుచేసుకునే విధానం
ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి. ఆ ఓట్స్‌ను మెత్తగా రుబ్బుకొని ఒక కప్పులోకి తీసుకోవాలి. అనంతరం ఆ పిండిలో పాలు పోసుకుంటూ.. ఉండలు లేకుండా దోశ పిండిలా కలుపుకోవాలి. అనంతరం ఆ పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పాలు అందుబాటులో లేకపోతే, పాలు ఇష్టం లేకపోతే పాల స్థానంలో నీళ్లను కూడా వినియోగించుకోవచ్చు.
ఇప్పుడు ఒక కప్పులో మూడు గుడ్లు పగలగొట్టుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికం, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా మనం చేసి పెట్టుకున్న ఓట్స్ పొడిలో కొద్దిగా ఉప్పువేసుకొని రుచి చూసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. దోశ పెనం పెట్టేసి, దానిపైన నూనె రాసుకోవాలి. ఇప్పుడు ఓట్స్‌తో ఒకసారి, ఆమ్లెట్ ఇంకోసారి.. ఒకదానిపై ఒకటి దోశలాగా వేసుకోవాలి.
అనంతరం వాటిపైన కొంచెం నూనెపోసి.. ఒక మూత వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రెండువైపులా ఇలా ఉడికించుకున్న తరువాత మూత తీసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఆ ఓట్స్ ఆమ్లెట్‌ను ఒక ప్లేట్‌లో తీసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా ఆరోగ్యవంతమైన ఓట్స్ ఆమ్లెట్ సిద్ధమైనట్లే. మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే ఒకసారి చేసి చూడండి. మీ పిల్లలతో పాటు మీరు కూడా ఎంతో ఇష్టంగా ఈ ఆమ్లెట్‌ను తింటారు. అలాగే ఆరోగ్యవంతమైనది కావడంతో బాగా మంచి బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓ సారి ట్రై చేయండి మరి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications