Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
చుక్క నూనె అక్కర్లేదు..ప్రొటీన్,ఫైబర్ ఎక్కువగా ఉండే హెల్దీ బ్రేక్ ఫాస్ట్..ఖర్చు లేకుండానే ఆరోగ్యం
మీరు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ రెసిపి కోసం చూస్తున్నారా? అయితే శనగల సలాడ్ రెసిపీ మీకు పర్ఫెక్ట్. దీన్ని తయారు చేయడం చాలా సులభం, ఎక్కువ సమయం పట్టదు, శాఖాహారులు లేదా ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక గొప్ప ఎంపిక. శనగలు ప్రొటీన్, పీచు పదార్థం, ముఖ్యమైన విటమిన్లు,మినరల్స్ నిలయం. ఈ సలాడ్ ను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, శక్తి లభిస్తుంది. దీనిని తయారుచేసుకోవడం ఎలాగో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-శనగలు
-ఉల్లిపాయలు
-క్యారెట్
-కీరదోసకాయ
-పచ్చిమిరపకాయ
-చిల్లీ ఫ్లేక్స్
-మిరియాల పొడి
-జీలకర్ర పొడి
-ఉప్పు
-గుమ్మడి గింజలు
-నల్ల నువ్వులు
-పెరుగు
-నిమ్మరసం
-కొత్తిమీర

తయారీ విధానం
-ముందుగా 1 కప్పు కాబూలీ శనగలు(తెల్లగా,లావుగా ఉండేవి) శుభ్రంగా కడిగా కనీసం 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి.
-తర్వాత నానిన శనగలను మరోసారి శుభ్రంగా కడిగి నీళ్లను వంపేసుకున్నాక స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో శెనగలు వేసుకోండి.
-శనగల్లో ముప్పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం మంట మీద 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
-శనగలు ఉడికేలోగా..1 పెద్ద కీరదోసకాయను చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. 1 పెద్ద క్యారెట్ ను తురుముకోవాలి. 1 ఉల్లిపాయను సన్నగా,పొడవుగా కట్ చేసుకోండి. 1 పచ్చిమిరపకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-శనగలు ఉడికిన తర్వాత నీటిని వంపేసి శెనగలను ఓ గిన్నెలోకి తీసుకిని పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత శనగల్లో రుచికి సరిపడా ఉప్పు(పావు టీస్పూన్), పావు టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్, పావు టీస్పూన్ మిరియాల పొడి, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి మొత్తం శెనగలకు బాగా పట్టేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో 1 కప్పు చిక్కటి పెరుగు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ,క్యారెట్,కీరా,పచ్చిమిర్చి ముక్కలన్నీ వేయండి. సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం కొంచెం, వేయించిన నువ్వులు 1 టేబుల్ స్పూన్, లైట్ గా వేయించిన 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే శనగల సలాడ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
