Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాతకాలంనాటి స్వీట్..జ్యూసీ జ్యూసీగా అదిరిపోయే టేస్ట్..దీపావళికి ఈజీగా చేసుకోవచ్చు
ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్, బేకరీ స్వీట్ల హడావిడిలో ఎన్నో సాంప్రదాయ వంటకాలు మరుగున పడిపోతున్నాయి. అటువంటి కోవకే చెందింది మక్మల్ పూరీ. ఒకప్పుడు మన పూర్వీకులు పండుగలప్పుడు, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే చేసుకునే ఒక అపురూపమైన తీపి వంటకం మక్మల్ పూరీ. మక్మల్ అంటే వెల్వెట్. పేరుకు తగ్గట్టే ఈ పూరీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, వెల్వెట్ లాంటి ఆకృతితో ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో దీని ప్రాచుర్యం ఎక్కువగా ఉండేది. మక్మల్ పూరీని ఈ దీపావళికి మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
తయీరీకి కావాల్సిన పదార్థాలు
-గోధుమపిండి
-వంటసోడా
-పెరుగు
-నెయ్యి
-ఆయిల్
-యాలకలు
-చక్కెర
-యాలకల పొడి
-పుట్నాల పప్పు(తినే శెనగపప్పు)
-ఎండుకొబ్బరి తురుము
-డ్రై ఫ్రూట్స్ తరుగు

మక్మల్ పూరీ తయారీ విధానం
-ముందుగా ఓ ప్లేట్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు గోధుమపిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ పౌడర్ లేదా వంటసోడా వేసి స్పూన్ తో మొత్తం కలిసేలా కలుపుకోండి.
-ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పూరీ,చపాతీకి కలుపుకున్నట్లుగానే పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూదు,మరీ మెత్తగా ఉండకూడదు.
-కలిపిన పిండిముద్ద పైన,కింద కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిముద్ద మీద మూతపెట్టి 15 నిమిషాలు పిండిని నాననివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో అరకప్పు తినే శెనగపప్పు, 2 యాలకలు, పావు కప్పు చక్కెర వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 కప్పు చక్కెర, 1కప్పు నీళ్లు పోసి కలుపుకుంటూ చక్కెరను కరగనివ్వాలి.చక్కెర పూర్తిగా కరిగాక మంటను తక్కువలో ఉంచి పాకం జిగురు జిగురుగా మారేదాకా ఉడికించుకోవాలి. ఉడికే సమయంలోనే ఇందులో కొంచెం యాలకల పొడి, 2 చుక్కల ఫుడ్ కలర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిన 2 నిమిషాల పాటు మళ్లీ మర్దన చేసినట్లు కలుపుకోవాలి. తర్వాత పిండిని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ పూరీలాగా వత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా,మరీ మందంగా కాకుండా మీడియంలో రోల్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చేశాక అందులో రెడీ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం మెత్తగా ఉండేలా కాల్చుకోవాలి. ఎర్రగా,క్రిస్పీగా ఉండేలా కాల్చుకోవద్దు.
-రెడీ చేసుకున్న పూరీలను ఓ ప్లేట్ లో పెట్టి పూరీల మీద ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పిండిని ఒక్కొక్క పూరీ మీద ఒక్కో స్పూన్ వేసుకోండి. పూరీ ఒకవైపు పిండిని స్ప్రెడ్ చేసుకొని పూరీని మూయండి. ఓపెన్ అవకుండా పూరీని కొంచెం లైట్ గా ప్రెస్ చేయండి. దీనిమీద కొంచెం ఎండుకొబ్బరి తురుము, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ చల్లుకోండి. అంతే మక్మల్ పూరీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications