Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
వందల రోగాల్ని నయం చేసే నల్లేరు కారం పొడి..ఎలా చేసుకోవాలో చూడండి
మన పూర్వీకులు మనకు అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపదలలో నల్లేరు ఒకటి. దీనిని సంస్కృతంలో అస్థిసంహారక అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఇది విరిగిన ఎముకలను సైతం అతికించగల శక్తివంతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. పల్లెటూర్లలో ఎక్కువగా దొరికే నల్లేరు సిటీల్లో దొరకడం కొంచెం కష్టమే. అయితే సిటీల్లో కూడా ఇంట్లోనే కుండీల్లోనే నల్లేరును పెంచుకోవచ్చు. నల్లేరును నేరుగా కూరగా వండుకోవడం కొంచెం కష్టం, దాని రుచి అందరికీ నచ్చకపోవచ్చు. కానీ దీనిని కారం పొడిగా చేసుకుని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే రుచితో పాటు చాలా ప్రయోజనాలు పొందవచ్చు.
రోజూ అన్నం తినేటప్పుడు మొదటిముద్ద ఈ కారం పొడితే తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఎముకలు ధృడంగా ఉండటానికి, ఎముకలు కీళ్ల నొప్పులు తగ్గడానికి,ఎప్పుడైనా ప్రమాదం జరిగి ఎముకలు విరిగినా అవి త్వరగా తిరిగి అతుక్కోడానికి చాలా బాగా పనిచేసే నల్లేరుతో ప్రతిరోజూ తినడానికి అనుకూలంగా ఉండేలా కారప్పొడి ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-నల్లేరు
కాడలు
-నువ్వులు
-మినపప్పు
-పచ్చి శెనగపప్పు
-ఎండుమిరపకాయలు
-ధనియాలు
-మెంతులు
-కరివేపాకు
-చింతపండు
-ఆయిల్
-వెల్లుల్లి రెబ్బలు
తయారీ విధానం
-ముందుగా కొన్ని లేత నల్లేరు కాడలను చిన్న ముక్కలుగా చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. నల్లేరు ముక్కలు బౌల్ కి సరిపడినన్ని ఉండాలి.
-నల్లేరు కాడలకు ఉండే ఆకులను కూడా కడిగి పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగిన తర్వాత ఇందులోనే పావు కప్పు మినపప్పు, పావు కప్పు పచ్చి శెనగపప్పు, చిటికెడు మెంతులు వేసి తక్కువ మంట మీద కలుపుతూ వేయించాలి.
-సగం వరకు వేగిన తర్వాత తినే కారానికి తగినట్లు 15-20 ఎండు మిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, పావు కప్పు నువ్వులు, పావు కప్పు ధనియాలు వేసి ఇవన్నీ 90 శాతం వేగాక ఇందులోనే గుప్పెడు కరివేపాకు వేసి ఇది కూడా క్రిస్పీగా వేగాక ఇందులోనే కొద్దగా చింతపండు వేసి 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో తడి లేకుండా ఆరబెట్టుకున్న నల్లేరు కాడల ముక్కలు, ఆకులు వేసి ముక్కల్లోని నీరు అంతా పోయి డ్రై అయ్యేదాకా వేయించుకొని స్ట్ ఆపి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ముందుగా వేయించి చల్లారిన పోపులన్నీ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో పూర్తిగా చల్లారిన నల్లేరు కాడల ముక్కలు అన్నీ వేసి, 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
-గ్రైండ్ చేసుకున్న రెండు మిశ్రమాలను ఓ ప్లేట్ లో వేసి చేత్తో బాగా కలిసేలా కలుపుకోవాలి. కాసేపు మూతపెట్టకుండా అలా వదిలేయండి. దీంతో గాలి తగిలి పొడి పొడిగా మారుతుంది.
-గాలి చొరబడని డబ్బాలో ఈ కారం వేసుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ప్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
