Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ !
పరోటా అనగానే చాలా మందికి బంగాళాదుంపతో చేయడమే గుర్తుకువస్తుంది. ఆలుగడ్డని ఉడకబెట్టి పరోటా చేయడానికి చాలా టైం పడుతుంది. అయితే అంత పెద్ద పని లేకుండా ఆలూ పరోటాకి మించిన రుచి, పోషకాలతో ఉల్లిపాయతో ఇలా పరోటా చేసి చూడండి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినేస్తారు. బరువు తగ్గాలనుకునేవారికి ఉల్లి పరోటా డైట్‌లో బెస్ట్ ఆప్షన్.

బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో తప్పనిసరిగా గోధుమ పిండిని చేర్చుకుంటారు. ఈ క్రమంలో పరోటాలో గోధుమ పిండిని ఉపయోగిస్తారు. పరోటా అంటే ఎవరికైనా ఆలూ పరోటా గుర్తుకొస్తుంది. కానీ ఇందులో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న కారణంగా వెయిట్ లాస్ కావాలనుకునేవారు బంగాళాదుంపకి దూరంగా ఉంటారు. అయితే ఈ సారి ఈ బాధ లేకుండా ఉల్లిపాయతో పరోటా చేసి తినండి. బరువు తగ్గడంతో పాటు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
ఉల్లి పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి- రెండు కప్పులు
పెరుగు- పావు కప్పు
నూనె- టేబుల్ స్పూన్
ఉల్లిపాయ- రెండు కప్పులు
ఉప్పు- రుచికి సరిపడా
అటుకులు- పావు కప్పు
పచ్చిమిర్చి- టేబుల్ స్పూన్
అల్లం, వెల్లుల్లి తరుగు- టీస్పూన్
కసూరి మెంతి- 2టీస్పూన్లు
కారం- టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
ధనియాలపొడి- టీస్పూన్
జీలకర్ర పొడి- అరటీస్పూన్
గరం మసాలా- అరటీస్పూన్
చాట్ మసాలా- అరటీస్పూన్
వాము- అర టీస్పూన్
పుదీనా- కొద్దిగా
ఉల్లి పరోటా తయారీ విధానం
ఉల్లి పరోటా తయారీకి ముందుగా గోధుమ పిండి ముద్దను తయారు చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, నూనె, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి సాఫ్ట్‌గా కలిపి పది నిమిషాల పాటు మూత ఉంచి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరో వెడల్పాటి గిన్నెలో తరిగిన ఉల్లిపాయలను రెండు కప్పులు తీసుకోవాలి. అందులోనే పొడి చేసిన అటుకులు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మెంతి, జీలకర్ర పొడి, వాము, కారం, చాట్ మసాలా, పసుపు అన్నీ వేసి మరోసారి కలుపుకోవాలి.

ఈ ఉల్లి మసాలా మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. చపాతీ పిండిని మీడియం సైజు ఉండల్లా చేసుకోవాలి. ఈ పిండి ముద్దను చిన్నగా చపాతీలా చేసి అందులో ఉల్లి మసాలా మిశ్రమం పెట్టి కప్పుకోవాలి.
దీనిని చపాతీ పీటపై పెట్టి పిండి ముద్దపై కొద్దిగా పుదీనా ఆకులను అద్దుకోవాలి. పొడి పిండి చల్లుకుని పరోటాను ఒత్తుకోవాలి.
స్టవ్ పైన పెనం పెట్టుకుని కొద్దిగా నూనె, లేదా బటర్‌తో పరోటాలను కాల్చుకోవాలి. ఇలాగే మిగతా వాటిని చేసుకోవాలి.
అంతే రుచికరమైన ఉల్లి పరోటా రెడీ. ఆలూ పరోటాతో పోలిస్తే తేలికగా, సులభంగా ఎక్కువ శ్రమ లేకుండా చేయవచ్చు. బ్రేక్ ఫాస్ట్‌లోకి అయినా, పిల్లల లంచ్ బాక్స్‌లోకి అయినా ఉల్లి పరోటా హెల్తీ వంటకం. వర్షాకాలంలో ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని తప్పనిసరి ట్రై చేయండి.
ఉల్లి పరోటా ఆరోగ్య ప్రయోజనాలు
ఉల్లి పరోటా ద్వారా ఫైబర్, ప్రీబయోటిక్స్ పుష్కలంగా అంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యలు ఉండవు. విటమిన్ సి కారణంగా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం ద్వారా డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఎముకల దృఢత్వానికి దోహదపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications