Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
కాల్షియం, ఐరన్ పుష్కలం..కేవలం 15 నిమిషాల్లో సూపర్ ఫుడ్ మునగాకుతో పకోడీలు..
మన భారతీయులకు సహజంగానే పకోడీలు అనగానే మనసు ఉరకలేస్తుంది. కానీ నూనెలో వేయించిన పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావనే భయం, క్యాలరీల గురించిన ఆందోళన వల్ల చాలామంది తమ కోరికను చంపుకుని పకోడీలకు దూరంగా ఉంటారు. అయితే, పకోడీలు తింటే అనారోగ్యం వస్తుందనే మీ భయాన్ని దూరం చేస్తూ, రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఒక అద్భుతమైన రెసిపీని మునగాకు పకోడీ.

మునగాకును ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక సూపర్ ఫుడ్ గా పరిగణిస్తున్నారు. ఇందులో ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉంటాయి. ఇవి మన ఎముకలను దృఢంగా చేయడంతో పాటు, శరీరంలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాంటి మునగాకుతో పకోడీలను తయారు చేయడం కూడా చాలా సులభం. కేవలం 15 నిమిషాల్లో మునగాకు పకోడీలను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
మునగాకు పకోడీ తయారీకి కావలసిన పదార్థాలు
తాజా మునగాకు - 1 కప్పు
శనగపిండి - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
కారం పొడి - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
వాము - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తాజా కొత్తిమీర - కొద్దిగా
నీరు - పిండి కలుపుకోవడానికి తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
మునగాకు పకోడీ తయారీ విధానం
-ముందుగా మునగాకులను కాడలు లేకుండా తుంచుకుని, శుభ్రమైన నీటిలో రెండు మూడు సార్లు కడగాలి. ఆకులకి ఉన్న నీరంతా పోయేలా ఒక జల్లెడలో వేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో శనగపిండి,కడిగి పెట్టుకున్న మునగాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు కలపండి. అలాగే వామును అరచేతిలో వేసి కాస్త నలిపి వేస్తే పకోడీలకు అద్భుతమైన సువాసన వస్తుంది. వీటన్నింటినీ ముందుగా చేత్తో బాగా కలపండి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పకోడీల పిండిలా కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ పలచగా ఉంటే పకోడీలు కరకరలాడవు, నూనె కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, కలుపుకున్న పిండిని కొద్దికొద్దిగా పకోడీల్లా నూనెలో వేయండి.
-పకోడీలు రెండు వైపులా చక్కటి బంగారు వర్ణంలోకి మారి కరకరలాడే వరకు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అదనపు నూనెను పీల్చుకోవడానికి ప్లేట్ లో ముందుగానే టిష్యూ పేపర్ వేయడం మర్చిపోకండి.
-అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన వేడి వేడి మునగాకు పకోడీలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications