For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనీర్ భుర్జీ మేకరోని రెసిపీ

మేకరోని అనేది బహుముఖ పదార్ధం. మేకరోనితో ఒక కొత్త ఫ్యూజన్ రెసిపీని మాంసం,కూరగాయలు, పనీర్ లేదా ఏ ఇతర పదార్ధాలతో నైనా సృష్టించవచ్చు.

Posted By: Lakshmi Perumalla
|

మేకరోని అనేది బహుముఖ పదార్ధం. మేకరోనితో ఒక కొత్త ఫ్యూజన్ రెసిపీని మాంసం,కూరగాయలు, పనీర్ లేదా ఏ ఇతర పదార్ధాలతో నైనా సృష్టించవచ్చు. అదే రుచితో ప్రయోగాలు చేసి రకరకాల రుచులను సృష్టించవచ్చు. ఈ రెసిపీ లో ఉపయోగించే పనీర్, మయోన్నైస్, మిరపకాయలు మొదలైనవి పూర్తిగా మేకరోని యొక్క భారతీయ రూపం. పనీర్ ని ఇష్టపడే స్నేహితులతో కలిసి తయారుచేసుకొని ఎంజాయ్ చేయండి.

పనీర్ భుర్జీ మేకరోని రెసిపీ | పనీర్ భుర్జీ పాస్తా రెసిపీని ఎలా తయారుచేయాలి | పనీర్ భుర్జీ పాస్తా రెసిపీ
పనీర్ భుర్జీ మేకరోని రెసిపీ | పనీర్ భుర్జీ పాస్తా రెసిపీని ఎలా తయారుచేయాలి | పనీర్ భుర్జీ పాస్తా రెసిపీ
Prep Time
15 Mins
Cook Time
5M
Total Time
20 Mins

Recipe By: చెఫ్ గౌరవ్ చదా

Recipe Type: స్నాక్స్

Serves: 3

Ingredients
  • నీరు - 1 లీటరు

    ఉప్పు - రుచికి సరిపడా

    మేకరోని - 2 కప్పులు

    విజిటెబుల్ నూనె - 2 టేబుల్ స్పూన్లు

    మీడియం సైజ్ ఉల్లిపాయ - 1 (తరిగినది)

    పచ్చి మిరపకాయలు - 2-3 (తరిగినవి)

    మీడియం ఆకుపచ్చ క్యాప్సికమ్ - ½ (తరిగినవి)

    ఎర్ర కారం పొడి - 1 స్పూన్

    పనీర్ (తురిమిన) - 1½ కప్పు

    పాలు - 1½ కప్పు

    తందూరి మయోన్నైస్ - 5 టేబుల్ స్పూన్లు

How to Prepare
  • 1. ఒక కుండ తీసుకోని దానిలో నీటిని నింపండి.

    2. మీడియం మంట మీద నీటిని మరిగించాలి.

    3. మరిగే నీటిలో 9 గ్రాముల ఉప్పు,మేకరోని వేయాలి.

    4. ప్యాక్ మీద సూచనల ప్రకారం లేదా సుమారు 5 నిమిషాల పాటు ఉడికించాలి.

    5. మేకరోని అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలపాలి.

    6. ఒక డ్రైనర్ సాయంతో ఉడికిన మేకరోనిలో ఉన్న నీటిని తొలగించాలి.

    7. ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకోవాలి.

    8. వంట చేయటానికి నాన్ స్టిక్ స్ప్రే లేదా నూనెను ఉపయోగించవచ్చు.

    9. పాన్ లో నూనె పోసి తక్కువ మంట మీద వేడి చేయాలి.

    10. ఉల్లిపాయ, పచ్చి మిరప మరియు క్యాప్సికమ్ ముక్కలు కోసుకోవాలి.

    11. పాన్ లో చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిరప మరియు క్యాప్సికమ్ లను వేయాలి.

    12. ఒక నిమిషం వేగించాలి.

    13. పనీర్ వేసి బాగా కలపాలి.

    14. పాలు పోసి కూరగాయ ముక్కలు కలిసేలా కలపాలి.

    15. పొయ్యి కట్టేసి మయోన్నైస్,చిటికెడు ఉప్పు వేసి కలపాలి.

    16. మరల పొయ్యి వెలిగించి సాస్ 1-2 నిముషాలు లేదా చిక్కగా వచ్చేవరకు ఉడికించాలి.

    17. సాస్ లో మేకరోని వేసి బాగా కలపాలి.

    18. సర్వ్ చేయటానికి వేడి వేడి పనీర్ భుర్జీ మేకరోని రెసిపీ రెడీ.

Instructions
  • 1. మీకు నచ్చిన ఏ రకం పాస్తా అయినా ఉపయోగించవచ్చు.
Nutritional Information
  • సర్వింగ్ సైజ్ - 1 కప్పు
  • కేలరీలు - 400 కేలరీలు
  • కొవ్వు - 32 గ్రాములు
  • ప్రోటీన్ - 26 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు - 45 గ్రాములు
  • పీచు - 3 గ్రాములు
[ 4.5 of 5 - 90 Users]
English summary

Paneer Bhurji Macaroni Recipe | How To Prepare Paneer Bhurji Pasta | Paneer Bhurji Pasta Recipe

Paneer bhurji macaroni is a unique recipe that is a fusion of two different cuisines. The traditional Italian macaroni pasta is cooked in Indian paneer bhurji. The tandoori mayonnaise used in the sauce gives it a unique flavour. Here is a recipe on how to prepare the Indian version of macaroni. Read and follow the detailed step-by-step procedure.
Story first published: Monday, November 27, 2017, 13:15 [IST]
Desktop Bottom Promotion