Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అటు ప్రొటీన్, ఇటు టేస్ట్.. పిల్లలు లంచ్ బాక్స్‌లోకి ఇష్టంగా తినేలా పనీర్ ఖీమా రైస్.!
స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. ఇక తల్లులకు హడావుడి మొదలవుతుంది. టిఫిన్ ఏం చేయాలి, లంచ్ కోసం ఏం వండాలి, ఇంకా స్నాక్స్ ఏం పెట్టాలి. ముఖ్యంగా లంచ్ బాక్సులోకి రోజుకో వెరైటీ తప్పనిసరిగా ఉండాలని మారాం చేస్తారు. ఇక వర్షాకాలంలో వారు హెల్తీగా ఉండటం తప్పనిసరి. ఈ క్రమంలో మీ పిల్లలు మధ్యాహ్నం భోజనం మెతుకు కూడా విడిచి పెట్టకుండా ఉండాలంటే.. ఈ స్పెషల్ రెసిపీ తప్పనిసరి.

పిల్లలకు చిన్న వయసు నుంచే ఆహారంలో ప్రొటీన్ తప్పనిసరి. ప్రొటీన్ పుష్కలంగా ఉండే వెజ్ వంటకాల్లో పనీర్ ముందుంటుంది. ఇక పనీర్ ఎక్కువగా చపాతీ, పరోటా, బటర్ నాన్‌తో బాగుంటుంది. పాలక్ పనీర్, పనీర్ కుర్మా ఇలా చాలా రకాల వెరైటీలు చేస్తాం. అయితే ఉదయం హడావుడిలో వీటిని లంచ్ బాక్స్లకి క్విక్‌గా చేయడానికి టైం ఉండదు. అందుకే ఇలా పనీర్‌తో ఖీమా రైస్ చేశారంటే తినడానికి చాలా ఈజీగా ఉండటంతో పాటు పిల్లలకు ఆరోగ్యాన్నీ అందిస్తుంది.
పనీర్ ఖీమా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పనీర్- 200 గ్రాములు
ఉడికించిన అన్నం- రెండు కప్పులు
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి- రెండు
క్యారెట్- ఒకటి
బీన్స్- నాలుగు
పచ్చి బఠాణీ- అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
ఉప్పు- ఒకటిన్నర టీ స్పూన్
కారం- ఒక టీస్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
మిరియాల పొడి- పావు టీస్పూన్
ఆయిల్- రెండు టీస్పూన్లు
నెయ్యి- ఒక టీస్పూన్
కొత్తిమీర- కొద్దిగా
జీడిపప్పు- 10
నిమ్మకాయ- సగం
పనీర్ ఖీమా రైస్ తయారీ విధానం
ముందుగా పనీర్‌ను తీసుకుని తురుముకోవాలి. ఇప్పుడు వెడల్పాటి పాన్ తీసుకుని అందులో నూనె, నెయ్యి వేసి జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర వేయాలి. కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేగాక క్యారెట్, బీన్స్, పచ్చి బఠాణీ వేసి రంగు మారే వరకు వేయించాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కాసేపు ఉంచాలి. తురుముకున్న పనీర్ వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి కలిపి ఉడకనివ్వాలి.
ఇప్పుడు ఈ పనీర్ మిశ్రమంలో ఉడికించిన అన్నం వేసి కలుపుకోవాలి. గరం మసాలా, మిరియాల పొడి వేసి కలిపి అన్నానికి ఈ స్టఫ్ మొత్తం మంచిగా పట్టేలా ఉడకనివ్వాలి. చివరిగా జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పై నుంచి నిమ్మరసం పిండి కలుపుకోవాలి. అంతే రుచికరమైన హెల్తీ పనీర్ ఖీమా రైస్ రెడీ.
ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే పనీర్‌తో ఖీమా రైస్‌ను పిల్లలకు అప్పుడప్పుడూ పెట్టడం ద్వారా కండరాల పెరుగుదలకు, ఎముకల బలానికి మేలు చేస్తుంది. ముక్కలుగా లేకపోవడంతో తినడానికి ఈజీగా ఉంటుంది. మెరుగైన జీర్ణక్రియకు దోహదపడి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. త్వరగా శక్తిని అందిస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్-డి ఎముకలను, దంతాలను దృఢంగా చేసేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications