Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పన్నీర్ పాయసం తయారీ । పన్నీర్ తో పాయసాన్ని చేయటం ఎలా । పన్నీర్ పాయసం రెసిపి
పండగలకి, ఇతర ఉత్సవాలకి చేసుకునే సాంప్రదాయ స్వీటు పన్నీర్ పాయసం. వీడియో, చిత్రాలతో కూడిన వివరమైన తయారీని చూడండి.
ఉత్తరాది వారు ప్రత్యేక పండగలకి చేసుకునే ప్రసిద్ధ తీపి పదార్థం పన్నీర్ పాయసం. పనీర్ ఖీర్ అని కూడా పిలవబడే దీన్ని పన్నీర్, పాలు, గట్టిపడిన పాలు మరియు సువాసనలిచ్చే ఏలకుల పొడి మరియు డ్రై ఫ్రూట్లతో తయారుచేస్తారు.
దీన్ని పండగలప్పుడే కాక,వ్రతాలప్పుడు కూడా చేస్తారు. గట్టిపర్చిన పాల తియ్యదనం, డ్రైఫ్రూట్ల ముక్కలతో, పన్నీర్ యొక్క కొంచెం ఉప్పదనం తగులుతూ అద్భుతమైన రుచిని అందిస్తాయి.
దీన్ని చిటికెలో శ్రమలేకుండా తయారుచేయవచ్చు. చల్లగా తింటేనే దీని రుచి చాలా బాగుంటుంది. మీరు దీన్ని ఇంట్లోనే తయారుచేయాలనుకుంటే చిత్రాలు, వీడియోతో కూడిన స్టెప్ బై స్టెప్ విధానాన్ని చదవండి.

Recipe By: మీనా బంఢారి
Recipe Type: స్వీట్లు
Serves: ఇద్దరికి
-
తరిగిన పన్నీర్ - ½ కప్పు
గట్టిపర్చిన పాలు - ¾ కప్పు
పాలు - ½ లీటరు
డ్రై ఫ్రూట్లు - 2-3 + అలంకరణకి
ఏలకుల పొడి - 1 చెంచా
-
1. తరిగిన పన్నీర్ ను వేడి పెనంలో వేయండి.
2. వెంటనే పాలను జతచేయండి.
3. 5-6 నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి.
4. గట్టిపాలను కూడా పోసి, మరో 3-4 నిమిషాలపాటు కలుపుతూనే ఉండండి.
5. ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.
6. డ్రై ఫ్రూట్లను, ఒక చెంచా తరిగిన బాదం పప్పును జతచేయండి.
7. బాగా కలిపి ఒక గిన్నెలోకి మార్చుకోండి.
8. తరిగిన బాదం, కిస్మిస్ లతో పైన అలంకరించండి.
9. చల్లబర్చి అందరికీ వడ్డించండి.
- 1. పాలు, పన్నీర్ ల మిశ్రమం ఉండకట్టకుండా, విరిగిపోకుండా కలుపుతూనే ఉండాలి.
- వడ్డించే పరిమాణం - ½ కప్పు
- క్యాలరీలు - 281.5 క్యాలరీలు
- కొవ్వు - 6.8 గ్రాములు
- ప్రొటీన్లు - 8 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 47.6 గ్రాములు
- ఫైబర్ - 0.2 గ్రాములు
స్టెప్ బై స్టెప్ - పన్నీర్ పాయసం ఎలా తయారుచేయాలి
1. తరిగిన పన్నీర్ ను వేడి పెనంలో వేయండి.

2. వెంటనే పాలను జతచేయండి.

3. 5-6 నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి.

4. గట్టిపాలను కూడా పోసి, మరో 3-4 నిమిషాలపాటు కలుపుతూనే ఉండండి.


5. ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.


6. డ్రై ఫ్రూట్లను, ఒక చెంచా తరిగిన బాదం పప్పును జతచేయండి.


7. బాగా కలిపి ఒక గిన్నెలోకి మార్చుకోండి.


8. తరిగిన బాదం, కిస్మిస్ లతో పైన అలంకరించండి.


9. చల్లబర్చి అందరికీ వడ్డించండి.


Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications